పాపం..జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు కష్టాలు తెలిస్తే కన్నీలాగావు..!!

Anilkumar
బుల్లితెరపై జబర్దస్త్ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది అని చెప్పవచ్చు.అంతేకాదు  ముఖ్యంగా ఎంతో మంది సినీ ఇండస్ట్రీకి కమెడియన్ గా కూడా పరిచయం చేసింది.ఇదిలావుంటే ఇక ప్రస్తుతం ఈ షోలో యాంకర్స్ గా రష్మీ , సౌమ్య రావు మాత్రమే ఉన్నారు. అయితే ఇక  కొత్త యాంకర్ సౌమ్యారావు అతి తక్కువ సమయంలోనే తన మాటలతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.అంతేకాకుండా ముఖ్యంగా తన అంద చందాలతో మాత్రం కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా కనిపిస్తోంది.  యాంకర్ గా టాప్ పొజిషన్లో ఉన్న రష్మీ, అనసూయాలను మించి క్రేజ్

 సంపాదించుకునేలా కనిపిస్తోందంటూ పలువురు నెటిజన్ల సైతం కామెంట్లు చేస్తున్నారు.ఇక  ఇదంతా పక్కన పెడితే తాజాగా ఒక కార్యక్రమంలో సౌమ్యా రావు ఏడ్చి అందరిని ఏడిపించేసింది.  అసలు విషయంలోకి వెళ్తే ఇటీవల ఒక షోలో భాగంగా ఈమె బాగా ఎమోషనల్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఇందులో తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని విషయాలను బయట పెట్టింది.ఆమె తన లైఫ్ గురించి చెప్తూ తనకు అమ్మ లేదు అని, నాన్న ఉండి కూడా లేనట్టే అని తెలియజేసింది.ఇక్కడున్న వారందరికీ అమ్మనో, నాన్ననో, అక్కనో, అన్ననో ఎవరో ఒకరు ఉంటారు.

 కానీ తనకు మాత్రం ఎవరూ లేరంటూ చాలా ఎమోషనల్ అయ్యింది సౌమ్య రావు.  ఇలాంటి ఫ్యామిలీ తనకు దొరికితే మాత్రం చాలా బాగా చూసుకుంటానని తెలియజేసింది. ఇక దీంతో ఈమె మాటలకు అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.అయితే ప్రస్తుతం సౌమ్యా రావు మాట్లాడిన మాటలు చాలా వైరల్ గా మారుతున్నాయి. ఈ బ్యూటీ యాంకర్ గా బాగానే పోటీ ఇస్తూ అప్పుడప్పుడు కమెడియన్లకు దీటుగా కౌంటర్లు కూడా వేస్తూ ఉంటుంది. సౌమ్య రావు అభిమానులు మాత్రం అందరినీ నవ్వించే సౌమ్య రావు జీవితంలో కూడా ఇలాంటి కష్టాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: