ఎన్టీఆర్ 30 వ మూవీ మ్యూజిక్ సెట్టింగ్ లలో పాల్గొంటున్న కొరటాల శివ... అనిరుద్..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో మరి కొన్ని రోజుల్లో ఓ మూవీ ప్రారంభం కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందబోతుంది. ఇది వరకే జూనియర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ మూవీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే తదుపరి మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కొంత కాలం క్రితం విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను ప్రపంచవ్యాప్తంగా సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. అలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కోసం కొరటాల శివ "ఆర్ ఆర్ ఆర్" మూవీ కి ఏ మాత్రం తగ్గని స్థాయిలో ఉండే కథను ఇప్పటికే రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ మెడికల్ మాఫియా నేపథ్యంలో సాగనున్నట్లు సమాచారం. అలాగే ఈ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
 

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించబోతున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా కొరటాల శివ మరియు అనిరుద్ రవిచంద్రన్ కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరిద్దరూ కలిసి ఎన్టీఆర్ 30 వ సినిమా ఆల్బమ్ కు సంబంధించిన చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే మరి కొన్ని రోజుల్లోనే ఎన్టీఆర్ 30 వ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కొరటాల , శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ దాదాపు తొమ్మిది భాషలలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: