నెక్స్ట్ మూవీలకు అదిరిపోయే లైనప్ ను సెట్ చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్..!

Pulgam Srinivas
టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ ఇప్పటికే ఈ సంవత్సరం విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ను కూడా దక్కించుకున్నాడు. ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి మూవీ ని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ మూవీ గా రూపొందిపోతుంది. అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించనుండగా , ఈ మూవీ కి రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు. ఈ మూవీ మెడికల్ మాఫియా నేపథ్యంలో రూపొందినట్లు తెలుస్తోంది. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో తేరకెక్కిన జనతా గ్యారేజ్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తేరకేక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు. ఈ మూవీ ఎన్టీఆర్ కెరియర్ లో 31 వ మూవీ గా రూపందబోతుంది.

ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ప్రశాంత్ నీల్ , జూనియర్ ఎన్టీఆర్ తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించ బోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ పై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి 2 మూవీ లను ఓకే చేసుకున్నాడు. ఈ రెండు మూవీ లు కనుక బ్లాక్ బస్టర్ విజయాలు సాధించినట్లు అయితే జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ పాన్ ఇండియా మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: