యూట్యూబ్ లో మరో రేర్ మార్క్ వ్యూస్ ను టచ్ చేసిన "రంజితమే" సాంగ్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి వంశీ పైడిపల్లి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వంశి పైడిపల్లి , రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇలియానా హీరోయిన్ గా తెరకెక్కిన మున్నా మూవీ తో దర్శకుడి గా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఆ తర్వాత బృందావనం , ఎవడు , ఊపిరి , మహర్షి మూవీ లకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తమిళ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న దళపతి విజయ్ హీరోగా తేరకెక్కుతున్న  వరిసు మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

ఈ మూవీ ని 2023 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి రంజితమే అనే సాంగ్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లోని రంజితమై సాంగ్ యూట్యూబ్ లో ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో వ్యూస్ ను సాధిస్తుంది. ఇప్పటికీ రంజితమే సాంగ్ యూట్యూబ్ లో  51 మిలియన్ వ్యూస్ ను , 1.8 మిలియన్ లైక్ లను సాధించింది. ఇలా రంజితమే సాంగ్ యూట్యూబ్ లో అదిరిపోయే రేంజ్ లో వ్యూస్ ను సాధిస్తూ దూసుకుపోతుంది. ఈ మూవీ పై విజయ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: