ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యేది ఎవరు ..ఒక్కసారిగా తలక్రిందులైన వోటింగ్స్..!?

Anilkumar
ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ తో పాటుగా ప్రేక్షకుల అంచనాలకు కూడా అందకుండా ఊహించని మలుపులు తీసుకుంటూ రోజుకో ట్విస్ట్ ఇస్తూ ముందుకు దూసుకుపోతుంది..అయితే గత వారం జరిగిన డబుల్ ఎలిమినేషన్ వీకెండ్ ద్వారా బాలాదిత్య మరియు వాసంతి ఎలిమినేట్ అయిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే.. ఇక వాళ్లిద్దరూ వెళ్లిపోయిన తర్వాత మిగిలిన టాప్ 10 కంటెస్టెంట్స్ లో ఫైమా మినహా అందరూ నామినేట్ అయ్యారూ.అయితే వీరిలో నిన్న బిగ్ బాస్ ఇచ్చిన ఇమ్యూనిటీ టాస్కు లో రాజ్ నామినేషన్స్ నుండి సేవ్ అవ్వగా శ్రీహన్ ,

 రేవంత్ , రోహిత్ , ఆది రెడ్డి ,మరీనా ,కీర్తి , శ్రీ సత్య మరియు ఇనాయ నామినేషన్స్ లో ఉన్నారు..వీరిలో ఎవరు అత్యధిక ఓట్లతో టాప్ లో ఉన్నారు..ఇక ఎవరు అతి తక్కువ ఓట్లతో ఎలిమినేషన్ కి దగ్గర్లో ఉన్నారు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం..అయితే అందరి కంటే అత్యధిక ఓట్లతో ప్రతి వారం లాగానే ఈ వారం కూడా రేవంత్ అందరిని డామినెటే చేస్తూ వోటింగ్ లో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్నాడు.ఇకపోతే రెండవ స్థానం లో ఇనాయ మరియు మూడవ స్థానం లో శ్రీహాన్ కొనసాగుతున్నాడు..గత రెండు వారల నుండి శ్రీహాన్ ని క్రిందకి నెట్టి ఇనాయ టాప్ 2 స్థానం లో కొనసాగుతుండడం విశేషం.

ఈ వారం సోషల్ మీడియా లో జరిగే పొలింగ్స్ అన్నిటిని ఆధారంగా తీసుకుంటే శ్రీహన్ మరియు రేవంత్ క్లోజ్ ఫ్రెండ్ శ్రీ సత్య ఎలిమినేట్ అవ్వడం పక్కలాగా అనిపిస్తుంది.. ఇక నిన్నటి వరుకు రాజ్ నామినేషన్స్ లో ఉండదా తో చివరి రెండు స్థానాల్లో కొనసాగుతూ ఉండేది శ్రీ సత్య.అయితే ఇప్పుడు రాజ్ నామినేషన్స్ నుండి తప్పించుకోవడం తో ఆఖరి స్థానం లో శ్రీ సత్య కొనసాగుతుంది..ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్కు బాగా ఆడితే ఆమె ముందుకెళ్లి మరీనా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి..కానీ ఇక  ప్రస్తుతానికి అయితే శ్రీ సత్య ఎలిమినేట్ అవ్వడానికి వంద శాతం ఛాన్స్ ఉంది..చూడాలి మరి ఆమె అదృష్టం ఎలా ఉందొ ఈసారి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: