కృష్ణ చనిపోవడానికి ఆ దర్శకుడే కారణమట..ఎవరంటే..?

Anilkumar
కృష్ణ అనారోగ్య కారణాలతో మంగళవారం తెల్లవారుజామున మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఆయన అనారోగ్య కారణాలతో చనిపోయినప్పటి నుండి ఆయన మీద అనేక వార్తలు వస్తున్నాయి.అయితే నిజానికి ఆయన మరణించింది కార్డియాక్ అరెస్ట్ రావడంతో మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆయన చనిపోయారు. తాజాగా ఆయన మరణానికి సంబంధించి కారణం ఓ డైరెక్టర్ అంటూ కొందరు సోషల్ మీడియాలో అర్థంలేని పోస్టులు పెడుతున్నారు.ఇక  ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.ఇకపోతే కృష్ణ చనిపోవడానికి ప్రధాన కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటూ కొందరు నెటిజన్ లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

ఎందుకంటే  ఇక హీరోల తండ్రులు వరుసగా త్రివిక్రమ్ తో సినిమాలు చేస్తున్నప్పుడే చనిపోతున్నారని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. అయితే త్రివిక్రమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి జల్సా సినిమా తెరకెక్కిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ తండ్రి కొణిదెల వెంకటరావు అనారోగ్య కారణాలతో చనిపోయారు.ఇక  అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమా తెరకెక్కిస్తున్న టైం లో ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు.హరికృష్ణ, వెంకటరావు ఇద్దరు మరణించేటప్పుడు త్రివిక్రమ్ తో ఎన్టీఆర్,పవన్ కళ్యాణ్ లు సినిమా చేస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా మహేష్ బాబుతో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సినిమా చేస్తున్నాడని సమాచారం.

 అయితే అందుకే మహేష్ తండ్రి కృష్ణ కూడా అనారోగ్య కారణాలతో మరణించారు.  ఈ విషయం గ్రహిస్తే పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు లతో త్రివిక్రమ్ సినిమా చేస్తున్న టైంలోనే వారి తండ్రులు మరణించారు. అయితే  వారి మరణానికి కారణం త్రివిక్రమ్ అంటూ సదరు నెటిజన్ ఓ కామెంట్ చేశాడు.  నెటిజన్ చేసిన కామెంట్ చూసి చాలామంది నెటిజన్లు అతనిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.ఇక మీరు చెప్పిందే నిజమైతే త్రివిక్రమ్ చాలా మంది హీరోలతో సినిమాలు తెరకేక్కించాడు.  వారి తండ్రులు బాగానే ఉన్నారు కదా. ఇక ఇది ఏదో సడన్గా జరిగిన విషయాన్ని పట్టుకొని అనవసరంగా త్రివిక్రమ్ మీద నెట్టివేయడం మంచి పద్ధతి కాదు అంటూ చాలామంది నెటిజన్లు అతనిపై మండిపడుతున్నారు.  అయితే వాస్తవానికి త్రివిక్రమ్ మహేష్ బాబు తో సినిమా చేస్తున్న విషయం నిజమే. ఈ సినిమా మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి చనిపోవడంతో వాయిదా పడింది.అంతేకాదు  అలాగే ఆ తర్వాత త్రివిక్రమ్ చెప్పిన స్టోరీ మహేష్ బాబుకు నచ్చకపోవడంతో కథలో కొంచెం మార్పు చేయమని చెప్పారట..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: