ఈ సంవత్సరం బ్లాక్ బాస్టర్ హిట్ తో కం బ్యాక్ ఇచ్చిన టాలీవుడ్ హీరోలు వీరే..!

Pulgam Srinivas
గత కొంత కాలంగా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను ఎదుర్కొంటూ , ఈ సంవత్సరంలో అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయంతో అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చిన టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసుకుందాం. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా విడుదల అయిన బంగార్రాజు మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నాగ చైతన్య ఒక కీలక పాత్రలో నటించగా , కళ్యాణ్ కృష్ణ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీ తో నాగార్జున అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని తిరిగి కం బ్యాక్ అయ్యాడు.  గత కొంత కాలంగా సరైన విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కని కళ్యాణ్ రామ్ ఈ సంవత్సరం విడుదల అయిన బింబిసారా మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఈ మూవీ కి మల్లాడి వశిష్ట దర్శకత్వం వహించగా , క్యాథరీన్ , సంయుక్త మీనన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించారు. నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చందు మండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ తో నిఖిల్ అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని తిరిగి కం బ్యాక్ అయ్యాడు.

చాలా కాలంగా సరైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేక పోయిన శర్వానంద్ ఈ సంవత్సరం ఒకే ఒక జీవితం మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.  ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం తో శర్వానంద్ తిరిగి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఇలా ఈ సంవత్సరం ఈ టాలీవుడ్ హీరోలు బ్లాక్ బాస్టర్ విజయాలతో తిరిగి కం బ్యాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: