మెరీనా రోహిత్ ఇన్నాళ్లు ఉండడానికి కారణం ఏంటి..?

Anilkumar
బిగ్ బాస్ సీజన్ 6 లో ప్రస్తుతం పది మంది మాత్రమే మిగిలి ఉన్నారు.ఇక  ఎంతో స్ట్రాంగ్ అనుకున్నా చాలా మంది కంటెస్టెంట్స్ కనిపించకుండా పోయారు.ఇక చంటి తో మొదలు పెడితే మొన్నటి ఎలిమినేషన్ లో బయటికి వచ్చేసిన వాసంతి వరకు ఎంత మంది స్ట్రాంగ్ కంటెంట్స్ బయటకు రావడం తో ఆట రసవత్తరంగా లేదు. అయితే గీతూ రాయల్, చంటి వంటి వారు హౌస్ లో ఉంటేనే వినోదాన్ని పండించే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా  ఇక వారిద్దరూ కాకుండా ఇంకా కొంత మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ హౌస్ లో ఉంటేనే బిగ్ బాస్ యొక్క స్టామినా అందరికి తెలుస్తుంది.

 ఇకపోతే వినోదాల విందుని అందించడంతో పాటు వారిద్దరు హౌస్ మొత్తం రచ్చ రచ్చ చేసేవారు.అయితే  ఇదే ఇప్పుడు అందరికీ కూడా విపరీతమైన కోపం వచ్చే విధంగా ఉంది.అయితే బిగ్ బాస్ నిర్వాహకులు ప్రేక్షకులకు కోపం వచ్చేలా చేస్తున్నారు. ఇక మెరీనా మరియు రోహిత్ ల కంటే ఎన్నో రెట్ల స్ట్రాంగ్ అయినా కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయి వెళ్లి పోయారు. కాగా ఇద్దరికీ ఇద్దరు కూడా ఇన్ని వారాలు కొనసాగడం ఆశ్చర్యంగా ఉందంటూ బుల్లి తెర వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.ఇక  మెరినా మరియు రోహిత్ ఇంకా ఎన్ని వారాలు ఉంటారు..

అయినా వారు ఇన్ని వారాలు ఉండడం ఏంటి అంటూ వారు చర్చించుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా లో వీరిద్దరికీ వ్యతిరేకంగా కొందరు పోస్ట్ లు పెడుతూ ఉంటే.. మరి కొందరు మాత్రం వీరికి మద్దతుగా మాట్లాడుతున్నారు.  అయితే రోహిత్ మరియు మెరీనా గేమ్ పెద్దగా ఆడరు.. కానీ ఇతరుల పట్ల సాఫ్ట్ కార్నర్ తో వ్యవహరిస్తూ మంచి పేరు అయితే దక్కించుకున్నారు.ఇక  అయినా కూడా వారికి హౌస్ లో ఇన్నాళ్లు ఉండే అంత అర్హత లేదని చెప్పాలి. ఇక  వీరిద్దరు బిగ్ బాస్ కు సరి పోరు అంటూ చాలా మంది బలంగా వాదిస్తున్నారు. ఇప్పటి వరకు వరకు వారు హౌస్ లో కంటిన్యూ అవ్వడం విడ్డూరంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: