పెళ్లి ఎప్పుడు అనేదానిపై క్లారిటీ ఇచ్చిన విశాల్..!

Pulgam Srinivas
తమిళ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన విశాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న విశాల్ కొన్ని సంవత్సరాల క్రితం తాను నటించిన తమిళ సినిమాను పందెం కోడి పేరుతో తెలుగు లో విడుదల చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే విశాల్ ఈ మధ్య కాలంలో తాను నటించిన ప్రతి మూవీ ని కూడా తెలుగు లో డబ్ చేసి విడుదల చేస్తున్నాడు. అందులో కొన్ని మూవీ లు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా విశాల్ "లాఠీ" అనే పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీకి వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా , రమణ , నందా ఈ మూవీ కి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని పోస్టర్ లను విడుదల చేయగా , వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

తాజాగా లాఠీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా జరిగింది.  ఈ‍ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న హీరో విశాల్ తన పెళ్లి పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లాఠీ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక లో విశాల్ మాట్లాడుతూ ... నడిగర్ సంఘం భవనం నిర్మించాకే నేను పెళ్లి చేసుకుంటాను అని ,  3,500 మంది నటీనటులు మరియు రంగస్థల కళాకారుల కోసం ఆ భవనం నిర్మిస్తున్నాం. వాళ్ళ లైఫ్ స్టైల్ మారాలి అని ,  కళాకారుల జీవనాన్ని మెరుగుపర్చేందుకు మా టీమ్ తీవ్రంగా శ్రమిస్తోంది అని  విశాల్ తాజాగా చెప్పుకొచ్చాడు.  భవనాన్ని నిర్మించి ,  పెళ్లి చేసుకుంటానని విశాల్ లాటి మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: