అక్కినేని కుటుంబం కంటె సమంతాదే పై చేయి..!!

Divya
తెలుగు సినీ పరిశ్రమలో కొంతమంది హీరోలు వరుస ప్లాపులతో సతమతమవుతూ ఉన్నారు. ఇలాంటి వారిలో అక్కినేని హీరోలు ఈమధ్య భారీ డిజాస్టర్ లను చవిచూస్తున్నారని చెప్పవచ్చు. సోగ్గాడే చిన్నినాయన సినిమా తరువాత నాగార్జున అంతటి సక్సెస్ను అందుకోలేదు. ఆ తర్వాత రాంగోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఆఫీసర్ సినిమా నుంచి వరుస ప్లాప్స్ అవుతూనే ఉన్నాయి. ఇక గత సంవత్సరం వచ్చిన బంగార్రాజు సినిమాతో పర్వాలేదనిపించుకున్నారు. దాదాపు నాగచైతన్య పరిస్థితి కూడా ఇలాగే ఉందని చెప్పవచ్చు. చివరిగా థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా ఫలితం అందుకోలేదు. ఇక అఖిల్ అయితే దాదాపుగా సినిమా విడుదల కాక రెండు సంవత్సరాలు పైనే అవుతోంది.

తాజాగా సమంత నటించిన యశోద సినిమా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుతోంది. అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో అక్కినేని హీరోల పై సమంత అదే పై చేయి అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అక్కినేని వారి మాజీ కోడలు అయిన సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత డిఫరెంట్ స్టైల్లో సినిమాలు చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తోంది. అయితే యశోద సినిమా ఇటీవల అక్కినేని హీరోల సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్లు ఉండడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఫస్ట్ డే సమంత యశోద నటించిన చిత్రానికి మూడు లక్షలకు పైగా  గ్రా స్ వసూలు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దసరా పండుగ సందర్భంగా నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా విడుదలై కేవలం రూ.2.35 లక్షల రూపాయల మాత్రమే కలెక్షన్లు సంపాదించింది. ఇక నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా పరిస్థితి కూడా ఇదే రూ 2.63 లక్షల రూపాయలను మాత్రమే రాబట్టింది. ప్రస్తుతం యశోద సినిమా కలెక్షన్లలో కూడా అక్కినేని హీరోలు కంటే ముందు వారసలోనే ఉండడంతో చర్చనీ అంశంగా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: