కూతుర్ని చూడడానికి అలాంటి కండిషన్లు పెట్టిన ఆలియా రణబీర్ దంపతులు..!?

Anilkumar
తాజాగా బాలీవుడ్ యంగ్ కపుల్ రణబీర్ కపూర్, ఆలియా భట్ తల్లిదండ్రులు అయ్యారు.ఇకపోతే పెళ్లైన కొన్నినెలలుకే వీరిద్దరు పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందారు. ఆలియా నవంబర్ 6వ తేదీన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఆదివారం ఉదయం ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆస్పత్రిలో ఆలియా భట్ తన భర్తతో కలిసి వచ్చింది.ఇదిలావుంటే ఇక ఆలియా రణ్ బీర తమ బేబీ ఫోటోను ఎక్కడ షేర్ చేయలేదు.అయితే మీడియా కంట పడకుండా జాగ్రత్తలు కూడా తీసుకున్నారట. ఈ క్రమంలో తమ బిడ్డను చూసేందుకు వచ్చే బంధువులకు కూడా ఈ జంట ఓ కండీషన్ పెట్టిందని సమాచారం.
ఇక ఆలియా బిడ్డతో ఇంటికి వచ్చిందని తెలియడంతో... చిన్నారిని చూసేందుకు పలువురు బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఆమె ఇంటికి క్యూ కడుతున్నారు.  తమ క్యూట్ బేబీని చూడలంటే మాత్రం ఓ కండీషన్ పెట్టింది జంట,అయితే పాపను చూడాలంటే వచ్చిన వారికి తప్పనిసరిగా కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ ఉండాలని ఈ జంట కండీషన్ పెట్టిందని తెలుస్తోంది.ఇక దీంతో కొందరుబంధు మిత్రులు కాస్త నిరాశకు గురవుతున్నారు. ఇంత నిబంధనలు ఎందుకంటే కాస్త అసహనం వ్యక్తంచేస్తున్నారు.ఇదిలావుండగా మరోవైపు ఆలియా విషయానికి వస్తే..
 ఈ భామ ప్రెగ్నెన్సీ టైంలో కూడా సినిమాల్లో, షూటింగుల్లో పాల్గొంటూ... సందడి చేసింది.ఇక  బ్రహ్మస్త్ర ప్రమోషన్లలో కూడా బేబీ బంప్‌తో కనిపించింది ఆలియా. బ్రహ్మస్త్రలో ఆలియా రణ్‌బీర్ కలిసి నటించిన విషయం తెలిసిందే.అయితే  ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ సాధించింది.ఇకపోతే  బాలీవుడ్‌ ఇండస్ట్రీకి చాలా రోజుల తర్వాత ఓ హిట్ అందించింది.ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా భట్ సీత పాత్రలో కనిపించారు.కాగా  సీత పాత్రలో ఆమె నటనతో అందర్నీ మెప్పించారు.అయితే  ఆలియా నటించిన గంగూభాయి కతియవాడి సినిమా కూడా విమర్శకుల చేత ప్రశంసలు దక్కించుకుంది. ఇక ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి తెరకెక్కించిన విషయం తెలిసిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: