బన్నీ రికార్డును చెరిపేసిన కాంతారా..!!

Divya
కన్నడ సినిమాలు అంటే గతంలో ఎవరు పెద్దగా పట్టించుకునే వారు కాదు.కానీ ప్రస్తుత కాలంలో కన్నడ సినిమాలకు మరింత క్రేజీ ఏర్పడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కే జి ఎఫ్, చార్లీ-777, విక్రాంత్ రోణ, కాంతారా వంటి చిత్రాలు కన్నడ పరిశ్రమకు మంచి పాపులారిటీ తెచ్చాయని చెప్పవచ్చు. ఇక కన్నడ చిత్రాలు పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై కలెక్షన్ల పరంగా కూడా పలు రికార్డులను సైతం సృష్టిస్తూ ఉన్నాయి. ఎక్కువగా హోంభలే ఫిలిమ్స్ బ్యానర్ పై ఎన్నో చిత్రాలు తెరకెక్కించి మంచి విజయాలు అందుకుంటున్నాయి.

ఇక తాజాగా విడుదలైన కాంతారా చిత్రం కేవలం రూ.16 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించగ ఇప్పుడు ఏకంగా రూ.250 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం విడుదల ఇప్పటికి 5 వారాలు కావస్తున్న ఎక్కడ ఈ సినిమా జోరు తగ్గడం లేదని చెప్పవచ్చు. అంతేకాకుండా ఓటీటి లో విడుదల కావలసిన ఈ సినిమాని పోస్ట్ ఫోన్ చేస్తూ ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అతి తక్కువ సమయంలోనే కాంతార చిత్రం రూ. 350 కోట్ల రూపాయలకు పైగా క్రాస్ వసూలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పుష్ప చిత్రం లైఫ్ టైం రన్ లో కూడా రూ.350 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ వసూళ్లని కాంతారా చిత్రం అతి తక్కువ సమయంలో అధికమించిందని సమాచారం ఇప్పటివరకు ఈ మూవీ అన్ని భాషలలో కలుపుకొని దాదాపుగా రూ.350 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. చిన్న సినిమాగా విడుదల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పలు రికార్డులను సృష్టించడమే కాకుండా సరికొత్త రికార్డులను సైతం తిరగరాస్తోందని చెప్పవచ్చు. ఇక రాబోయే రోజుల్లో ఎన్ని సరికొత్త రికార్డులను ఈ చిత్రం తిరగరాస్తుందో చూడాలి మరి. ఎట్టకేలకు అల్లు అర్జున్ రికార్డులను సైతం బ్రేక్ చేశారు రిషబ్ శెట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: