ముందు సహజీవనం..తర్వాతే పెళ్లి అంటున్న అల్లు శిరీష్..!!

murali krishna
అల్లు శిరీష్.. హీరోగా సరైన హిట్టు కోసం చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాడు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ సరైన హిట్టు రాక చాలా బాధపడుతున్నాడు.ఇక ఈ మధ్యనే ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో మొత్తానికి హిట్ అందుకొని మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు అల్లు శిరీష్. ఈయన ఇండస్ట్రీకి వచ్చి చాలా రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఈయన నటించిన ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. ఇక ఊర్వశివో రాక్షసివో సినిమా విడుదలై ప్రేక్షకుల్లో పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది.
ఇక సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో మూవీ యూనిట్ సక్సెస్ మీట్ ని, అలాగే యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ వంటి భారీ ఈవెంట్లను నిర్వహించారు. ఇక ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా బన్నీ హాజరై అందర్నీ అట్రాక్ట్ చేశారు. ఇక ఈ ఈవెంట్లో అల్లు శిరీష్ వివాహంపై కొన్ని ఆసక్తికర విషయాలు బయట పెట్టారు. అల్లు శిరీష్ మాట్లాడుతూ.. ఊర్వశివో రాక్షసివో సినిమాలో ముద్దు పెట్టే సన్నివేశాలన్నీ సెన్స్ తో తెరకెక్కించామని, ఎక్కడా కూడా మేము మా హద్దులు దాటలేదు.
ఈ సినిమాలో సహజీవనం,పెళ్లి, ప్రేమ అనే అంశాల గురించి చెప్పుకొచ్చాం. ఇక నాకు వివాహ వ్యవస్థ పై చాలా బలమైన నమ్మకం ఉంది. కానీ సహజీవనం చేశాక పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమోఅని నా అభిప్రాయం. అలాగే నా పెళ్లి గురించి మా ఇంట్లో వాళ్ళు ఏ మాత్రం నన్ను ఒత్తిడి చేయడం లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమా రొమాంటిక్ కామెడీ జోనర్లో తెరకెక్కి ప్రేక్షకులలో పాజిటివ్ టాక్ అందుకుంది. ఇందులో హీరో ప్రేమిస్తున్నాను అంటూ హీరోయిన్ వెంటపడుతూ ఉంటాడు.
కానీ హీరోయిన్ మాత్రం కేవలం రొమాన్స్ చేస్తూ పెళ్లికి నో అంటుంది. వీరి మధ్యలో కామెడీ టచ్ ఇవ్వడానికి వెన్నెల కిషోర్, సునీల్,పోసాని వంటి పాత్రలు ఉన్నాయి. అలాగే హీరోయిన్ ఆమని వైపు నుండి అమ్మ సెంటిమెంట్. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించిందని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనాప్పటికీ అల్లు శిరీష్ సహజీవనం చేశాకే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: