"నేను స్టూడెంట్ సార్" మూవీ టీజర్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ యూనిట్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బెల్లంకొండ గణేష్ తాజాగా స్వాతి ముత్యం మూవీ తో హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. స్వాతి ముత్యం మూవీ లో బెల్లంకొండ గణేష్ సరసన వర్షా బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి , బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా స్వాతి ముత్యం మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.
 

ఇది ఇలా ఉంటే బెల్లంకొండ గణేష్ తాజాగా నేను స్టూడెంట్ సార్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సతీష్ వర్మ ఈ మూవీ ని నిర్మిస్తూ ఉండగా , రాఖి ఉప్పలపాటి ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. రాఖీ ఉప్పలపాటి ఈ మూవీ తో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలు పెట్ట బోతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా నేనే స్టూడెంట్ సార్ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది  తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టీజర్ విడుదల తేదీని ప్రకటించింది. నేను స్టూడెంట్ సార్ మూవీ టీజర్ నవంబర్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: