దిల్ రాజుపై పీకల్లోతు కోపంలో మెగా నందమూరి ఫ్యాన్స్?

Purushottham Vinay
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దిల్ రాజు.అయితే ఇప్పుడు నిర్మాత దిల్ రాజు పై మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఇంకా అలాగే బాలయ్య అభిమానులు ఎంతగానో మండిపడుతున్నారు. కేవలం ఒక డబ్బింగ్ సినిమా కోసం స్టార్ హీరోల సినిమాలు అడ్డుకుంటావా అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన పై టాలీవుడ్   హీరోల అభిమానులు తెగ మండిపడుతున్నారు. ఇక కె.ఎస్ రవీంద్ర దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. ఇందులో మరో సీనియర్ హీరో రవితేజ కూడా కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. అలాగే ఇదే సంస్థ నుంచి విడుదల కానున్న మరో సినిమా వీరసింహా రెడ్డి. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు సంక్రాంతి పండుగకు విడుదల అయ్యి బాక్సాఫీసు వద్ద పోటీ పడనున్నాయి. ఈ రెండు సినిమాల మధ్యలోకి ఇప్పుడు నిర్మాత దిల్ రాజు విజయ్ తో చేస్తున్న తన వారసుడు సినిమాని తీసుకొచ్చారు.


తమిళ స్టార్ హీరో విజయ్  హీరోగా నటించిన ఈ సినిమాకు మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. నిజానికి ఈ సినిమా ఇది తమిళ సినిమా. అందువల్ల ఈ సినిమా తమిళంలో వారిసు పేరుతో తమిళంలో తెరకెక్కనుంది.అయితే వారసుడు సినిమా కోసం నిర్మాత దిల్ రాజు ఆంధ్ర నైజాం లో ఎక్కువ థియేటర్లను తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.అందువల్ల చిరంజీవి బాలకృష్ణ అభిమానులు స్పందిస్తూ దిల్ రాజు పై తెగ మండిపడుతున్నారు. ఒక తమిళ హీరో కోసం తెలుగులో సీనియర్ స్టార్ హీరోలుగా తరతరాలుగా కొనసాగుతున్న చిరు, బాలయ్య సినిమాలకు గండిగొడతావా అంటూ దిల్ రాజుపై అభిమానులు బాగా కోప్పడుతున్నారు. వారసుడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో చేసిన మార్కెట్ రూ.9 కోట్లని.. దాని కోసం రూ.60 నుంచి రూ.70 కోట్లు బిజినెస్ చేసే సినిమాలకు అడ్డుపడతారా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు అభిమానులు. ఇక దీనిపై చిరంజీవి, బాలకృష్ణ స్పందించాలని దిల్ రాజుపై ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి ఈ వార్తపై మెగాస్టార్ ఇంకా అలాగే బాలకృష్ణ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: