ఓటిటి ప్లాట్ ఫామ్ లో దూసుకుపోతున్న "అందరూ బాగుండాలి అందులో నేనుండాలి" మూవీ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి నటులుగా గుర్తింపు తెచ్చుకున్న ఆలీ మరియు నరేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆలీ , నరేష్ ఇప్పటికే ఎన్నో సినిమా లలో ,  ఎన్నో పాత్రలలో నటించి ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా అలీ మరియు నరేష్ ప్రధాన పాత్రలలో అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహించాడు.  రాకేశ్‌ పళిదం ఈ మూవీ కి సంగీతం అందించగా ,  అలీవుడ్ ఎంట‌ర్‌టైన్‌ మెంట్స్ బ్యానర్‌ పై శ్రీపురం కిరణ్ దర్శకత్వం లో ఆలీ, కొణతాల మోహన్, శ్రీచరణ్‌ ఈ మూవీ ని నిర్మించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటు వంటి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తున్నట్లు తెలుస్తోంది.
 

ఇది ఇలా ఉంటే తాజాగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫాం ఈ మూవీ 2 కోట్ల ప్లేస్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించినట్లు తాజాగా ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అద్భుతమైన రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రస్తుతం దూసుకుపోతున్నట్లు ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: