రవితేజ మూవీ లో ఛాన్స్ కొట్టేసిన అనూ ఇమాన్యుయల్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును కలిగి ఉన్న హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి అను ఇమాన్యుయల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన మజ్ను మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అజ్ఞాతవాసి , నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా , శైలజ రెడ్డి అల్లుడు , మహా సముద్రం , ఊర్వశివో రాక్షసివో వంటి పలు మూవీ లలో నటించి ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే అను ఇమన్యుయల్ తాజాగా నటించిన ఊర్వశివో రాక్షసివో మూవీ ప్రస్తుతం విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఈ మూవీ లో అల్లు శిరీష్ హీరోగా నటించాడు. ఇది ఇలా ఉంటే గత కొంత కాలంగా వరుస సినిమా అవకాశాలను దక్కించుకోవడంలో కాస్త వెనుకబడి పోయిన అను ఇమ్మానుయేల్ ఈ మధ్య కాలంలో మాత్రం వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ,  ఫుల్ జోష్ లో తన కెరియర్ ను ముందుకు సాగిస్తోంది.

అందులో భాగంగా ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న రావణాసుర మూవీ లో నటిస్తోంది. అలాగే తమిళ క్రేజీ నటుడు కార్తీ హీరోగా తిరక్కనున్న జపాన్ మూవీ లో అవకాశం దక్కించుకుంది. ఈ రెండు మూవీ లతో పాటు మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ గా చిత్ర బృందం అను ఇమాన్యుయల్ ను అనుకుంటున్నట్లు ,  అన్ని కుదిరితే ఈ ముద్దుగుమ్మ ఈ క్రేజీ కాంబినేషన్ మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: