వైరల్ అవుతున్న మహేష్ బాబు జిమ్ లో ఫోటో..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. మహేష్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతోంది. ఈ మూవీ లో పూజా హెగ్డే , మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇది వరకే వీరిద్దరూ కలిసి మహర్షి మూవీ లో నటించారు. మహర్షి మూవీ లో వీరిద్దరి జంటకు మంచి ప్రశంసలు దక్కాయి.
 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి తమన్ సంగీతం అందించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ విజయవంతంగా పూర్తి అయింది. ఈ మూవీ రెండవ షెడ్యూల్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం కావాల్సి ఉండగా , మహేష్ బాబు విదేశాలకు వెళ్లడంతో , ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు , అందులో పూజా హెగ్డే కూడా జాయిన్ కాబోతున్నట్లు , మహేష్ మరియు పూజా హెగ్డే లపై పెళ్లి సన్నివేశాలను షూట్ చేయనున్నట్లు తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా మహేష్ బాబు కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో మహేష్ బాబు జిమ్ లో వర్కౌట్ చేస్తూ ఉన్నాడు. జిమ్ ట్రైనర్ సమక్షంలో మహేష్ బాబు వర్కౌట్ చేస్తున్నాడు. ప్రస్తుతం జిమ్ వర్కౌట్ చేస్తున్న మహేష్ బాబు కు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ తర్వాత రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: