గంగుబాయి లుక్ లో అలరిస్తున్న శ్రీముఖి..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటి మరియు యాంకర్ అయినటు వంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అనేక సినిమాల ద్వారా , అనేక టీవీ షో ల ద్వారా  , అనేక "ఓ టి టి" షో ల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం కూడా వరుస మూవీ లలో నటిస్తూనే , అనేక టీవీ షో లకు , "ఓ టి టి" షో లకు యాంకర్ గా కూడా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శ్రీ ముఖి , మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ లో నటిస్తోంది.
 

ఈ మూవీ లో మిల్కీ బ్యూటీ తమన్నా , మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే శ్రీ ముఖి ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా శ్రీ ముఖి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో ఆలియా భట్ ప్రధాన పాత్రలో తేరకెక్కిన గంగుబాయి కథియవాడి మూవీ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది.
 

శ్రీ ముఖి తాజాగా తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో వైట్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని , అందుకు తగిన వైట్ కలర్ బ్లౌజ్ ను ధరించి , మెడలో ఒక లాకెట్ ను వేసుకొని ,  కళ్ళకి అద్దాలు పెట్టుకొని గంగుబాయి కథియవాడి మూవీ లో అలియా భట్ వేషధారణలో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం గంగుబాయి లుక్ లో ఉన్న శ్రీ ముఖి కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: