మరో యంగ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన బాలయ్య.. ఎవరంటే..!?

Anilkumar
టాలీవుడ్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఇతర సీనియర్ హీరోలకంటే ఓ అడుగు ముందున్నాడని చెప్పాలి.ఇక  అటు సినిమాలను వరుసగా చేస్తూ, టాక్ షోను సక్సెస్‌ఫుల్‌గా హోస్ట్ చేస్తూ తనదైన దూకుడును చూపిస్తున్నాడు.ఇదిలావుంటే ఇక ఇతర హీరోల సినిమాలకు గెస్టుగా వచ్చినా, అక్కడా బాలయ్య క్రేజ్ నెక్ట్స్ లెవెల్‌లో కనిపిస్తోంది. ఇక ఇంతలా బాలయ్య జోరును చూపిస్తూనే, తన సినిమాల సెలెక్షన్ విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.అయితే ఇప్పటికే యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో 'వీరసింహీరెడ్డి' అనే పవర్‌ఫుల్ మూవీని తెరకెక్కిస్తున్న టాలీవుడ్ నందమూరి బాలకృష్ణ , 

ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమా తరువాత మరో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఓ విభిన్నమైన పాత్రలో బాలయ్య నటించేందుకు సిద్ధమవుతున్నాడు.  అయితే ప్రేక్షకులు మునుపెన్నడూ చూడని బాలయ్యను ఈ సినిమాలో చూపించబోతున్నాడట దర్శకుడు అనిల్ రావిపూడి. అయితే ఇక  ఇప్పుడు మరో యంగ్ డైరెక్టర్‌కు కూడా బాలయ్య ఛాన్స్ ఇచ్చేందుకు రెడీ అయినట్లుగా చిత్ర వర్గల్లో టాక్ వినిపిస్తోంది.ఇకపోతే తనదైన సినిమాలతో విలక్షణమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ వెంకటేశ్ మహా, 

ఇప్పుడు టాలీవుడ్ నందమూరి బాలకృష్ణ ను డైరెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఓ ఎక్స్‌పరిమెంటల్ కథను బాలయ్యకు ఆయన ఇటీవల వినిపించాడట.ఇక కథ విన్న బాలయ్య ఈ సినిమా చేసేందుకు ఆసక్తిని కనబరచిడాని.. స్క్రిప్టును పూర్తిగా డెవెలప్ చేయమని బాలయ్య కోరినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమాను పూర్తి సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కించేందుకు వెంకటేశ్ మహా రెడీ అవుతున్నాడట. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ నందమూరి బాలకృష్ణ పాత్ర కూడా చాలా వైవిధ్యంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాలంటే, ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: