ఫ్యాన్స్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రౌడీ హీరో.. ఏకంగా 90 కోట్లు..!!

Anilkumar
రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే . ఇక పెళ్లి చూపులు అనే సినిమాతో క్లాసిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న విజయ్..అయితే ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాశాడు .ఇకపోతే  తనపై ఉన్న ఇంప్రెషన్ ని మొత్తం మార్చేశాడు . ఇక యాటిట్యూడ్ చూపిస్తూ అర్జున్ అనే పాత్రలో ఒదిగిపోయి నిజంగానే అర్జున్ రెడ్డిలా మారిపోయాడు . అంతేకాదు  ఇక ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు విజయ్ దేవరకొండకు అంత పెద్ద హిట్ అందుకోలేదు .ఇకపోతే గీత గోవిందం సినిమా హిట్ అయిన అది క్లాసిక్ లవ్ స్టోరీ గా అయిపోయింది . 

 విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి లాంటి హిట్ అయితే కాదు.  ఈ మధ్యనే పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయిన లైగర్ సినిమా విజయ్ దేవరకొండ ను పూర్తిగా నిరాశపరిచింది. ఇక మొదటి రోజు నెగటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం అటు దర్శకుడు పూరి జగన్నాథ్ కి.. ఇటు హీరో విజయ్ దేవరకొండ కెరియర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ గా నిలిచింది.  అయితే ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ లో ఘనమైన ఎంట్రీ ఇద్దామనుకున్న విజయ్ కు నిరాశ మిగిలింది.ప్రజెంట్ విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా "ఖుషి" .ఇక  ఈ సినిమాలో హీరోయిన్గా సమంత నటిస్తున్నారు.అయితే  ఈ సినిమాకి శివ నిర్వాణ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాడు .

కాగా  సామ్ అనారోగ్యం పాలవడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.ఇక  సామ్ ఆరోగ్యం సెట్ అవ్వగానే ఖుషి సినిమా మిగతా రెండు షెడ్యూల్ పూర్తి చేస్తారు. ఇదిలావుంటే అందుతున్న సమాచారం ప్రకారం ఖుషి నాన్‌-థియేట్రికల్‌ రైట్స్‌ 90 కోట్లకు అమ్ముడుపోయిన్నత్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక హిందీ తో కలిసి అన్ని భాషల్లో కలిపి దాదాపు 90 కోట్లకు పైగానే అమ్ముడుపోయాడట . అయితే నిజంగా విజయ్ కెరియర్ లో ఇది ఒక రికార్డు అని చెప్పాలి . ఇక ఈ సినిమాలో విజయ్ సామ్ భార్యాభర్తలుగా కనిపించబోతున్నారట. అయితే అందుకే ఈ సినిమా ఇంత ట్రేడింగ్ జరిగిందని అంటున్నారు.  లైగర్ లాంటి ఫ్లాప్ తరువాత కూడా విజయ్ సినిమా ఇంత భారీ ధర కు పలకడం నిజంగానే రౌడీ హీరో మజాకా అంటున్నారు అభిమానులు . ఇకపోతే ఏది ఏమైనా సరే రౌడీ హీరో క్రేజ్ మాత్రం తగ్గలేదు ఇలా వరుసగా షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంటాడు విజయ్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: