జబర్దస్త్ నూకరాజులో.. ఇంత గొప్ప నటుడు ఉన్నాడా?

praveen
ఇటీవల కాలంలో ఒక చిన్న సినిమాగా విడుదల ఏకంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన మూవీ ఏది అంటే ప్రతి ఒక్కరు చెప్పేది కాంతారా అని. ఒక కన్నడ మూవీ గా వచ్చి అతి పెద్ద హిట్ సాధించిన సినిమాగా నిలిచింది. ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ వైపు ప్రస్తుతం దూసుకుపోతుంది అని చెప్పాలి. కేవలం 18 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన  ఈ సినిమా నిర్మాతలు అందరికీ కూడా లాభాల పంట పండించింది. భాషతో సంబంధం లేకుండా అందరి మనసులు గెలుచుకుని వావ్ సూపర్ హిట్ అనే టాక్ ను సంపాదించుకుంది ఈ సినిమా. ముఖ్యంగా ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటనకు ప్రతి ఒక్కరు కూడా మంత్రముగ్ధులు  అయిపోయారు అని చెప్పాలి.

 విమర్శకులు సైతం రిషబ్ శెట్టి నటనపై ప్రశంసలు కురిపించి ఆకాశానికి ఎత్తేసారు. అయితే ఇక సినిమా మొత్తం రిషబ్ శెట్టి  నటన ఒక ఎత్తైతే చివర్లో ఉండే యాక్షన్ సీక్వెన్స్ లో రిషబ్ శెట్టి ఏకంగా దేవుడు పూనిన సమయంలో చేసే నటన.. చూపించే హవ భావాలు అందరిని కట్టిపడేస్తూ ఉంటాయి. రిషబ్ శెట్టి లో ఇంత గొప్ప నటుడు దాగి ఉన్నాడా అనే ప్రతి ఒక్కరి ప్రేక్షకుడిలో ఆలోచన వచ్చేలా చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇలా సినిమాలో క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.

 అయితే ఇటీవల కాలంలో సినిమాల్లో ఉన్న కొన్ని సన్నివేశాలను బుల్లితెర కార్యక్రమాలలో స్పూఫ్ చేయడం లాంటివి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీలో కాంతారా సినిమాలోని క్లైమాక్స్ ఎలిమెంట్ ను జబర్దస్త్ కమెడియన్ నూకరాజు ఏకంగా రిషబ్ శెట్టి పాత్ర పోషించి పర్ఫామెన్స్ చేశాడు. ఏకంగా రిషబ్ శెట్టి తరహాలోనే నూకరాజు హావభావాలు పండించిన తీరు చూసి అభిమానులు సైతం షాక్ అయ్యారు అని చెప్పాలి.. నూకరాజులో ఇంత గొప్ప నటుడు దాగి ఉన్నాడా అంటూ ఎంతోమంది కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇక నూకరాజు పర్ఫామెన్స్ చూస్తూ ఉంటే అచ్చం సినిమా చూసిన ఫీల్ వస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: