ఎన్టీఆర్ లేకపోతే.. ఆ దర్శకుడికి అంత్యక్రియలు కూడా జరిగేవి కాదట తెలుసా?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో నటసార్వభౌముడిగా తిరుగులేని ప్రస్తానని కొనసాగించారు నందమూరి తారక రామారావు. ఏకంగా తెలుగుజాతి ఖ్యాతిని ఎల్లలు దాటించిన గొప్ప వ్యక్తిగా ఇప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పటికీ ఏ హీరోకి సాధ్యం కానీ రీతిలో అప్పట్లోనే ప్రఖ్యాతి సంపాదించారు ఎన్టీఆర్ . అయితే ఇండస్ట్రీలో ఆయన స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలో ఎంతోమందికి అండా దండగా నిలిచి ఒక గొప్ప వ్యక్తిగా కూడా అందరి మన్ననలు అందుకున్నారు.

 అయితే ఇలా నందమూరి తారక రామారావు ఏకంగా సినీ నటుడు దర్శకుడు అయిన వి నాగయ్య విషయంలో చేసిన ఒక పని ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో ఎంతోమంది పెద్దలు చర్చించుకుంటూ ఉంటారు. వి నాగయ్య నేటితరం ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదేమో కానీ ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలో మాత్రం దర్శక నిర్మాతలు అందరూ కూడా వీ నాగయ్య డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఈయన నా హీరోగా మాత్రమే కాదు సంగీత దర్శకుడు సినీ దర్శకుడుగా కూడా తన ప్రతిభ ఏంటో నిరూపించారు. ఇక  తక్కువ ఖర్చుతో సినిమా తీయడంలో ఈయనకు మించిన వారు లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 హీరోగా ఈయన వేమన సినిమాలో నటింగా.. ఇక ఈ సినిమా ఈయనకు ఎంతగానో గుర్తింపును తెచ్చి పెట్టింది. ఇక అప్పట్లో ఉండే స్టార్ హీరోల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే వారట నాగయ్య. అయితే ఆయన పెద్ద స్టార్ అయినప్పటికీ ఆయనకు పిల్లలు లేకపోవడం ఒక వెలితిగా మిగిలి పోయిందట. ఇక ఆయన పట్ల ఎంతగానో ప్రేమ చూపించే ఏఎన్ఆర్ ఎన్టీఆర్ లనే సొంత బిడ్డల్లా భావించే వారట నాగయ్య. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కూడా నాగయ్యను నాన్నగారు అని పిలిచేవారట. సినిమాల్లో ఎంతో డబ్బు సంపాదించిన నాగయ్య వృధా ఖర్చులు చేస్తూ సంపాదించిందంతా పోగొట్టుకునే వాడట. కొత్తగా సినిమాల్లోకి వచ్చే వారికి కూడా సహాయ సహకారాలు అందించేవాడట. ఇలాంటి మంచితనమే ఆయనకు చివరి రోజుల్లో రూపాయి లేకుండా చేసింది. నాగయ్య చివరి దశలో అంత్యక్రియలకు చేసేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో ఇక అన్నగారే ముందుకు వచ్చి ఆ ఖర్చు మొత్తం భరించి అంత్యక్రియలను పూర్తి చేశారట. విషయాన్ని గుమ్మడి బుక్ లో రాసుకోవచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: