మెహర్ రమేష్ పై అంత నమ్మకం ఏంటి?

P.Nishanth Kumar
మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. భోళా శంక ర్ అనే తమిళ రీమేక్ సినిమా ను తెలుగులో చేస్తున్న ఈ కాంబో ఈ సినిమా పట్ల ఎంతో నమ్మకాన్ని వ్యక్తపరుస్తుంది. అంతకు ముందు మెహర్ రమేష్ సినిమాలు ప్రేక్షకులను పెద్దగా మె ప్పించలేకపోయాయి. ఒక బిల్లా సినిమా తప్ప మిగతా సినిమాలన్నీ కూడా భారీ డిజాస్టర్స్ గా మారిపోయాయి. ఈ నేపథ్యంలో మెహర్ రమేష్ చాలా రోజుల తర్వాత ఈ సినిమా తో కం బ్యాక్ చేస్తున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి కూడా రిస్క్ చేసి మరి ఈ దర్శకుడికి అవకాశం ఇవ్వడం జరిగింది. దీనితో మెహర్ రమేష్ నిరూపిం చుకుంటే కనుక తప్పకుండా మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దర్శకుడుగా మంచి టెక్నిక్ ఉన్న ఈ మెహర్ రమేష్ తప్పకుండా హిట్టు సాధించాలని చాలామంది కోరుకుంటున్నారు. ఇకపోతే తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి బర్త్డే వేడుకలను నిర్వహించారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించిన సెట్స్ లో మెహర్ రమేష్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.  

ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది కి విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతి కానుక గా బాబీ దర్శకత్వంలోని రూపొందుతున్న వాల్తేరు వీరయ్య సినిమా ను విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలు కీర్తి సురేష్ నటిస్తుండగా ఈ చిత్రం కూడా తప్పకుండా ప్రేక్షకులందరికీ కూడా అలరిస్తుంది అన్న నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు చిత్ర బృందం. ఇకపోతే ఈ సినిమా లో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం సమకరుస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: