రామ్ చరణ్ కి ఆ మెగా హీరో అంటే అస్సలు ఇష్టం లేదట.. ఎందుకో తెలుసా..?

Anilkumar
మెగా ఫ్యామిలీకి  టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి గౌరవం ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ ప్రత్యేకత రావడానికి ప్రధాన కారణం చిరంజీవి గారు.అయితే ఈయన ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అలాగే ఈయన వల్ల మెగా ఫ్యామిలీ నుండి చాలామంది హీరోలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు ఇండస్ట్రీని దాదాపు రెండు దశాబ్దాల పాటు మెగాస్టార్ చిరంజీవి ఏలారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈయన పేరు చెప్పుకొని చాలామంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు. 

అంతేకాదు మరికొంతమంది ఆయన పేరుతోనే బ్రతుకుతున్న వారు ఉన్నారు.మెగా ఫ్యామిలీలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా కూడా అందులో ఫ్యామిలీ సభ్యులు మొత్తం ఏకమైపోయి సెలబ్రేట్ చేసుకుంటారు.  ఈ విషయం పక్కన పెడితే మెగా ఫ్యామిలీ లో ఇద్దరు అన్నదమ్ముల మధ్య లోలోపల చాలా గొడవలు ఉన్నాయని కానీ బయటికి మాత్రం బాగా కలిసిపోయి ఉన్నట్లు కనిపిస్తారు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే  ఈ నేపద్యంలోనే మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కి అసలు పడడం లేదు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి.  ఆ వార్తలు అన్నిటికి చెక్ పెడుతూ అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ కలిసి పోవడం చూసి వీరి మధ్య ఏం గొడవలు లేవు అని భావించారు.  ఈ విషయం పక్కన పెడితే తాజాగా రామ్ చరణ్ కి నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కి ఒక్క క్షణం కూడా పడడం లేదు అంటూ నెట్టింట్లో ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారుతుంది.

ఇక చిన్నప్పటినుండి రాంచరణ్ కి వరుణ్ తేజ్ అంటే అస్సలు ఇష్టం లేదట.అయితే  చిన్నప్పటినుండి వీళ్ళిద్దరూ ఎప్పుడు దెబ్బలాడుకునే వారట. చిన్నపిల్లలు కదా ఏదో సరదాకి దెబ్బలాడుకుంటున్నారులే అని లైట్ తీసుకున్నారట చిరంజీవి నాగబాబు. వాళ్ళు పెద్దయ్యాక కూడా వారి మధ్య పగ పెంచుకొని ఒకరిపై ఒకరు ఈగోలకు పోతున్నారట.ఇక దీంతో వీరి మధ్య కోల్డ్ వార్ మరీ ముదిరిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఇక వీళ్ళు ఒకరింటికి ఒకరు వెళ్లినా కూడా కనీసం పలకరించుకోరాట.ఇకపోతే ఏదో వాళ్ళ అమ్మ వాళ్ళు పలకరించమంటే ఏదో మొక్కుబడిగా పలకరిస్తారట.ఇక  ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.  ఈ వార్తల్లో నిజం ఏంటో అబద్ధం ఏంటో తెలియాలంటే కచ్చితంగా మెగా ఫ్యామిలీ స్పందించాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: