జబర్దస్త్ కొత్త యాంకర్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Anilkumar
ఈటివిలో ప్రసరమయ్యే జబర్దస్త్ నుంచి యాంకర్ అనసూయ తప్పుకోవడంతో ఆ స్థానాన్ని యాంకర్ రష్మీ భర్తీ చేశారు.  మరొకవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ షో నుంచీ కూడా సుదీర్ తప్పుకోవడంతో అక్కడ కూడా రష్మీ యాంకర్ గా బాధ్యత చేపట్టక తప్పలేదు..ఇక ఈ క్రమంలోని ఆమెకు అదనపు బాధ్యతల కారణంగా ఇబ్బంది అవుతుందని జబర్దస్త్ కి కొత్త యాంకర్ సౌమ్యరావును తీసుకొచ్చారు. ఈమె కూడా హైపర్ ఆది , రాంప్రసాద్ లకు ఏమాత్రం తగ్గకుండా పంచ్ ల వర్షం కురిపించి. అయితే అందరి చేత నవ్వులు పూయించింది.ఇదిలావుంటే  ప్రస్తుతం ఈ కొత్త యాంకర్ ఎవరు అని తెలుసుకోవడానికి ఆత్రుత చూపిస్తున్నారు ప్రేక్షకులు. 

ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం.అయితే సౌమ్యరావు నడిక్.. కర్ణాటక కు చెందిన అమ్మాయి. ఇక సౌమ్య రావు నడిక్ అసలు పేరు సౌమ్య శారద. 1992 సెప్టెంబర్ 29న కర్ణాటకలోని సీమొగ లో జన్మించింది.అయితే  నటిగా కాకుండా మోడల్గా తన కెరీర్ను మొదలుపెట్టింది.  ఈమె చదువంతా సీమొగ లోని గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో పూర్తి చేసింది.ఇకపోతే  బెంగళూరులో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సౌమ్య చదువు పూర్తవు గానే కన్నడ న్యూస్ ఛానల్ న్యూస్ రీడర్గా తన కెరీర్ ను మొదలుపెట్టింది .అయితే  నటన మీద ఆసక్తి ఉండడంతో కన్నడ, తమిళ్ సీరియల్స్ లో నటించింది. అంతేకాదు  ఇక తన అందంతో ..

మరో పక్క పెర్ఫార్మెన్స్ తో యువతను సైతం బాగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.ఇకపోతే నెగిటివ్ రోల్స్ చేయడంలో ఈమె తర్వాతే ఎవరైనా విలనిజాన్ని చూపించే పాత్రలో లీనమైపోయి మరి నటించేది. అందుకే ఇక  ఈమెకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది.అయితే  తాజాగా తెలుగు సీరియల్ లోకి కూడా అడుగుపెట్టింది సౌమ్యారావు.. తాజాగా ప్రసారమవుతున్న శ్రీమంతుడు సీరియల్ లో సత్య క్యారెక్టర్ లో తన విలనిజాన్ని చూపిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇదిలావుంటే మరో పక్క ఇదే పేరు తో సత్య అనే క్యారెక్టర్ లో మనసు మాట వినదు సీరియల్ లో కూడా నటిస్తోంది.ఇక  ఈ సీరియల్స్ లో ఈమె పర్ఫామెన్స్ చూసి ఇప్పుడు యాంకర్ గా ఈమెకు అవకాశం ఇచ్చారు మల్లెమాల. అయితే ఇప్పటి వరకూ విలనిజాన్ని చూపిస్తూ ప్రేక్షకులను భయపెట్టిన సౌమ్యరావు.. ఇకపై తన కామెడీతో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: