తమన్నా ఆ ఆట నేర్పిస్తున్న ప్రభాస్.. వీడియో వైరల్..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ ప్రభాస్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రభాస్ తో కలిసి సినిమా చేయాలని ఎంతోమంది హీరోయిన్లు సైతం చాలా ఆత్రుతగా ఉంటారు. ముఖ్యంగా ప్రభాస్ ప్రతి ఒక్కరితో కూడా చాలా ఫ్రెండ్షిప్ గా ఉంటారు.అందులో ప్రభాస్, తమన్నా ఇప్పటికే రెండు చిత్రాలలో నటించారు. అందులో ఒకటి రెబెల్ కాగా మరొకటి బాహుబలి సినిమా. దీంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉందని చెప్పవచ్చు. ఇక షూటింగ్ సమయాలలో సెట్లో ఖాళీ సమయం దొరికితే చాలు ప్రభాస్ అక్కడున్న వాళ్ళతో ఆడుతూ ఉంటారట.

ఈ క్రమంలోనే తమన్నాకు,ప్రభాస్ చెస్ నేర్పిస్తున్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే ఆ వీడియో ఇప్పటిది కాదు రెబల్ సినిమా షూటింగ్ సమయంలో అన్నట్లుగా తెలుస్తోంది. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన రెబల్ సినిమా ఇద్దరు జోడిగా నటించారు. ఈ సినిమా షూటింగ్ గ్యాప్ తర్వాత ప్రభాస్, తమన్నా ఇలా చేస్ ఆడుతూ కనిపించడం జరిగింది. చెస్ ఎలా ఆడాలో తమన్నాకు ప్రభాస్ పూర్తిగా వివరిస్తున్నట్లుగా ఈ వీడియోలో కనిపిస్తూ ఉన్నది. దీంతో ప్రభాస్ కు చేస్తా అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.

గతంలో తమన్నా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ గురించి పలు విషయాలు తెలియజేసింది. ఆయనతో రెండు సినిమాలు పనిచేశాను వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అని ప్రశ్న ఎదురుగా.. రెబల్ సినిమా సమయంలో ప్రభాస్ తో ఎక్కువ మాట్లాడే అవకాశం దక్కలేదు. కానీ బాహుబలి సినిమా సమయంలో మాత్రం ఎక్కువ సమయం దొరకడంతో మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయామని తెలియజేసింది. ప్రభాస్ ప్రతి ఒక్కరితో కలిసిపోయి ఒక ఫ్యామిలీల ఉంటారని తెలియజేసింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ కెరియర్ విషయానికి వస్తే వరుస పాన్ ఇండియా సినిమాలలో బిజీగా ఉన్నారు. ఆది పురుష్, సలార్ , ప్రాజెక్టుకే సినిమాలో నటిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: