జూనియర్ ఎన్టీఆర్ సరసన ఆ బాలీవుడ్ బ్యూటీ..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరి కొన్ని రోజుల్లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనుండగా ,  రత్నవేలు ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు. ఇలా ఉంటే ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ స్థాయికి మించి తొమ్మిది భాషలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ ని పాన్ ఇండియా స్థాయికి మించి తెరకెక్కించాలనే ఉద్దేశంతో కొరటాల శివ కూడా ఈ మూవీ కథపై చాలా వర్క్ చేసినట్లు తెలుస్తుంది.  

అలాగే ఈ మూవీ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్టీఆర్ సరికొత్త లుక్ లోకి రావడం కోసం ఇప్పటికే జిమ్ లో కాసరత్తును కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులు అవుతున్న ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ గురించి మాత్రం చిత్ర బృందం అధికారిక ప్రకటన చేయలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుకున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ మూవీ యూనిట్ జాన్వి కపూర్ తో చర్చలు జరపగా ,  జాహ్న కపూర్ ,  ఎన్టీఆర్ సరసన నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఎన్టీఆర్ మూవీ లో జాహ్న కపూర్ నటించబోయే విషయం పై అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇది వరకు జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకేక్కిన జనతా గ్యారేజ్ మూవీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న రెండవ మూవీ పై ఎన్టీఆర్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: