అఖిల్ "ఏజెంట్" మూవీ ని ఆ తేదీన విడుదల చేయనున్నారా..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కినేని అఖిల్ ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ హీరో ఏజెంట్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ ఉండగా ,  ఈ మూవీ కి హిప్ హప్ తమిజా సంగీతం అందిస్తున్నాడు.

సాక్షి వైద్య ఈ మూవీ లో అక్కినేని అఖిల్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఏజెంట్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మూవీ లో మమ్ముట్టి ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఏజెంట్ మూవీ నీ పాన్ ఇండియా మూవీ గా తెలుగు ,  తమిళ , కన్నడ , మలయాళ హిందీ భాషల్లో భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఏజెంట్ మూవీ ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించినప్పటికీ , ఏ తేదీన ఈ మూవీ ని విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం మూవీ యూనిట్ ప్రకటించలేదు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఏజెంట్ మూవీ ని 13 జనవరి 2023 వ తేదీన విడుదల చేయాలి అనే ఆలోచనలో ఏజెంట్ మూవీ యూనిట్ ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  ఇది ఇలా ఉంటే ఏజెంట్ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఏజెంట్ మూవీ తో అక్కినేని అఖిల్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: