పుష్ప 2 ఆలస్యం కావడానికి కారణం అదేనా...?

murali krishna
అల్లు అర్జున్ క్రేజీ మూవీ పుష్ప 1 బ్లాక్ బస్టరయింది. ఈ సినిమాతో బన్నీ రేంజ్ పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోయింది. ఈ సీనిమా సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ సుకుమార్ ప్రకటించడంతో పార్ట్ 2 కోసం ఈగర్ గా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారట.
అయితే పుష్ప 1 థియేటర్లోకి రావడానికి ఆలస్యమైంది. షూటింగ్ ప్రారంభమైన రెండు సంవత్సరాలకు వెండితెరపై సందడి చేసింది. ఇప్పుడు పుష్ప 2 కూడా నత్తనడకన సాగుతోంది. అప్పటి 'పుష్ప'కు కరోనా అడ్డంకి ఏర్పడింది. సినిమా కథలో మార్పులతో కొన్ని నెలలు అయితే పట్టాయి. అంతేకాకుండా పుష్ప 2 కథ రెడీగా ఉందని సుక్కు అప్పుడే తెలిపాడు. కానీ ఈ సినిమా షూటింగ్ ఎందుకు ఆలస్యమవుతోందని బన్నీ ఫ్యాన్స్ అడుగుతున్నారట

పుష్ప 1 రిలీజై దాదాపు ఏడాది దగ్గరపడుతోంది. అల్లు అర్జున్ కూడా మరో ప్రాజెక్ట్ సైన్ చేయకుండా 'పుష్ప ది రూల్ ' కోసమే వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మూవీ నుంచి బన్నీ ఓన్లీ లుక్స్ మాత్రమే బయటకు వచ్చాయట.. మూవీ షూటింగ్ స్ట్రాట్ అనే విషయాన్ని ఎప్పుడు చెబుతారా..? అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ ఏ సినిమా మొదలు పెట్టినా ఏడాదిన్నర సమయం తీసుకుంటారు. ఇప్పడు 'పుష్ప ది రూల్ ' మొదలు పెట్టినా అంతే సమయం తీసుకునే అవకాశం అయితే ఉంది.
ఇంచుమించు రెండేళ్ల దాకా 'పుష్ప 2'కోసం ఆగాల్సిందేనా..? అని అభిమానులు నిరుత్సాహం చెందుతున్నారు. ఈ మూవీ మొదటి పార్ట్ పాన్ ఇండియా లెవల్లో సక్సెస్ సాధించింది. దీంతో రెండో భాగాన్ని అంతకు మించిన స్థాయిలో తీయాలని అనుకుంటున్నారు. మొదటి పార్ట్ కోసం రాజమండ్రి, కేరళలో షూటింగ్ తీశారు. కానీ ఇప్పుడు నార్త్ లోని కొన్ని ప్లేసులతో పాటు బ్యాంకాక్ వెళ్లొచ్చినట్లు సినీ బృందం తెలిపింది. అంతేకాకుండా ప్రీ ప్రొడక్షన్ పనుల విషయంలో కాంప్రమైజ్ కావడానికి కష్టమవుతోందని సమాచారం.

ఇటీవల అల్లు అర్జున్ లేని సీన్స్ కొన్ని షూట్ చేసారు. ఆ తరువాత బన్నీని టెస్ట్ షూట్ చేశారు. అంతేగానీ.. సినిమా ముందుకు సాగడం లేదు. ఇప్పటి వవకు కేవలం బన్నీ లుక్స్ మాత్రమే బయటకు వచ్చాయి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా రావడం లేదు. దీంతో పుష్ప ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు. అయితే కథలో కొన్ని మార్పులు చేసుకుంటున్నాడట సుకుమార్. దీంతో ప్రీ ఫ్రొడక్షన్ వర్క్ మరింత పొడగించే అవకాశం ఉందని అంటున్నారట.ఈ తరుణంలో పుష్ప మెయిన్ షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభమవుతుందో చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: