ఆ సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ..!!

murali krishna
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం లో 'రంగమార్తాండ' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
మరాఠీ సూపర్ హిట్ మూవీ 'నటసామ్రాట్‌' కు రీమేక్‌గా ఈ చిత్రం వస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్ర లో తెరకెక్కుతున్న రంగమార్తాండ సినిమాలో రమ్యకృష్ణ మరియు బ్రహ్మానందం, అనసూయ భరద్వాజ్, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ తదితరు లు నటించారు. ఈ సినిమా డిసెంబర్‌ లో విడుదల కానుందని తెలుస్తుంది.
కృష్ణవంశీ దర్శకత్వం లో ఎన్నో సూపర్ హిట్ సినిమా లు వచ్చాయి. అదే సమయం లో డేంజర్‌ లాంటి పరాజయాలు కూడా అందుకున్నారు. అల్లరి నరేశ్‌, కలర్స్ స్వాతి, సాయిరామ్‌ శంకర్‌ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకు ల ఆదరణ అందుకోలేక పోయింది. డేంజర్‌ సినిమా విడుదలై.. సుమారు 17 ఏళ్లు అవుతోన్న నేపథ్యంలో సీక్వెల్‌పై కృష్ణ వంశీ స్పందించారు. డేంజర్‌ కు స్వీకెల్‌ తెరకెక్కించండి అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'సినిమా ఫ్లాప్‌. అంటే ప్రకారం ప్రేక్షకులు సినిమా ని అంగీకరించలేదు. ఇప్పుడు సీక్వెల్‌ ఎలా చేయగలను' అని బదులిచ్చార ట..
మీ ఉద్దేశంలో ఫ్లాప్‌ అంటే ఏంటి అని మరో నెటిజన్‌ అడగ్గా.. డేంజర్‌ సినిమా మా మనుసు దోచుకుంది. కానీ సినిమాపై పెట్టిన డబ్బు ను నిర్మాత తిరిగి పొందలేక పోయాడు. దీన్నే ఫ్లాప్‌ అని అంటారు. డబ్బే రాజ్యం ఏలుతున్న ఈ రోజుల్లో ఈ సినిమా పై పెట్టుబడి పెట్టడానికి ఏ నిర్మాత ముందుకు రాడు' అని కృష్ణవంశీ పేర్కొన్నారు. చాలా గ్యాప్ తరవాత కృష్ణవంశీ రంగ మార్తాండ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా పై ఆయన భారీ అంచనాల ను కూడా పెట్టుకున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: