మహేష్ మూవీని ఇమిటేట్ చేస్తున్న తమిళ్ స్టార్ ....??

murali krishna
ప్రముఖ నటుడు విజయ్ నటించిన 'వారసుడు' సినిమా తమిళంలో మంచి క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. కానీ తెలుగులో మాత్రం ఈ సినిమాని ఎక్కువమంది చూడకపోవచ్చు.ఆది పురుష్, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి సినిమాల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ వారసుడు సినిమాపై లేదు. ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజు కావడంతో టాలీవుడ్‌లో కాస్త రెస్పాన్స్ వస్తోంది. కానీ ఈ సంక్రాంతికి దానికి పోటీగా వస్తున్న సినిమాలను తట్టుకొని నిలబడటం మాత్రం కష్టమే. అంతేకాకుండా ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ విజయ్ ఫ్యాన్స్‌కి కాకుండా మిగితావారికి ఏమంతా గొప్పగా అనిపించడం లేదట. మహేష్ నటించిన మహర్షి సినిమాతో వీటిని లింక్స్ చేసి ట్రోల్ చేస్తున్నారట. అసలు మహర్షి సినిమాకి, వారసుడు సినిమాకి ఉన్న లింక్ ఏంటి?వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన 'వారసుడు' మూవీ మహర్షి సినిమాతో ఎందుకు పోలుస్తున్నారంటే.. ఆ సినిమాకి కూడా దర్శకత్వం వహించాడు. అది చాలదన్నట్టు వారసుడు సినిమాకి, మహర్షి సినిమాకి మేకింగ్‌లో, గెటప్స్‌లో చాలా దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి. వేషధారణలు కూడా అచ్చు గుద్దినట్లు ఉన్నాయి. ఆ రెండు ఫొటోలను పోలుస్తూ మహేష్ ఫ్యాన్స్ గతంలో ఒకసారి తమను ట్రోల్ చేసిన విజయ్ ఫ్యాన్స్ ని ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో టార్గెట్ ఒక మిని వార్ కూడా మొదలుపెట్టారు.
వారసుడు స్టోరీ కూడా అజ్ఞాతవాసిలా ఉంటుందట. దూరంగా వెళ్ళిపోయిన వారసుడు తిరిగి వచ్చి కుటుంబం కోసం తమ వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా నిలబెడతాడనేదే మూవీ కథ అని తెలుస్తోంది. అసలు ఈ స్టోరీ నిజమో కాదో ఎవరికీ కన్ఫర్మ్ గా తెలీదు. కానీ వారసుడు సినిమా వంశీ కాస్త కొత్తగా డిఫరెంట్‌గా ట్రై చేసినట్లు ఏమీ అనిపించడం లేదు. ఇకపోతే నవంబర్ 4న మొదటి ఆడియో సింగిల్‌ వచ్చే అవకాశం ఉంది. వారసుడు సినిమాలో విజయ్ సరసన రష్మిక నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: