"హరిహర వీరమల్లు" మూవీ లో "అర్జున్ రాంపాల్" స్థానంలో ఆ నటుడు..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తూ ఉండగా ,  నిధి అగర్వాల్ ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఎం ఎం కీరవాణి ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలమే అవుతున్న హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ని ప్రారంభించిన తర్వాత పవన్ కళ్యాణ్ "భీమ్లా నాయక్" మూవీ పై కాస్త ఎక్కువ ఆసక్తిని చూపించడం ,  అలాగే దర్శకుడు కృష్ జాగర్లమూడి ,  పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కొండపొలం అనే మూవీ కి దర్శకత్వం వహించడం తో కొన్ని రోజులపాటు ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది.

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ తిరిగి మళ్లీ ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ లో మొదట అర్జున్ రాంపాల్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక వార్త బయటకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా అర్జున్ రాంపాల్ ఈ మూవీ నుండి తప్పుకున్నట్లు ,  ఆ స్థానంలో మూవీ యూనిట్ బాబి డియోల్ ను తీసుకున్నట్లు ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఏ మూవీ పై సినీ ప్రేమికుల భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీ పై పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ ని నిర్మాతలు అత్యంత భారీ బడ్జెట్ తో చాలా గ్రాండ్ గా తేరక్కెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: