"వారసుడు" మూవీ ఫ్యామిలీ సినిమా కాదు... వంశీ పైడిపల్లి..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన వంశీ పైడిపల్లి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వంశి పైడిపల్లి ఇప్పటికే అనేక తెలుగు మూవీ లకు దర్శకత్వం వహించి , అందులో భాగంగా అనేక విజయాలను బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడు గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే వంశీ పైడిపల్లి ఆఖరిగా మహర్షి మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.

మహర్షి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే మహర్షి మూవీ తర్వాత వంశీ పైడిపల్లి కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు ఆయన దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ఒక మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని తమిళ్ మరియు తెలుగు లో విడుదల చేయనున్నారు. తమిళ్ లో ఈ మూవీ ని వరసు అనే పేరుతో విడుదల చేయనుండగా ,  తెలుగు లో వారసుడు అనే పేరుతో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తమిళ్ లో రూపొందుతూ ఉండగా తెలుగు లో ఈ మూవీ ని డబ్ చేసి విడుదల చేయనున్నట్లు కొంత కాలం క్రితమే వంశీ పైడిపల్లి తెలియజేశాడు.

ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అని కొన్ని వార్తలు బయటికి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వార్తలపై దర్శకుడు వంశీ పైడిపల్లి స్పందిస్తూ ...  దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న వరసు మూవీ కేవలం ఫ్యామిలీ మూవీ కాదు అని , అంతకుమించి ఉంటుంది అని పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: