రౌడీ హీరోకి హ్యాండ్ ఇచ్చిన సమంత..?

Anilkumar
సినీ ఇండస్ట్రీలో బ్యాగ్గ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయిన హీరో విజయ్ దేవరకొండ. ఇక 'పెళ్లి చూపులు' అనే చిత్రంతో పరిచయమైన అతడు..ఇకపోతే కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. అయితే అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు. ఇక ఈ క్రమంలోనే ఇటీవలే విజయ్ 'లైగర్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఇకపోతే  క్రేజీ కాంబినేషన్‌లో పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన ఈ సినిమాకు ఆడియెన్స్ షాక్ ఇచ్చారు.ఇక  దీంతో ఈ మూవీ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే.

ఇక క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' అనే సినిమాను చేస్తున్నాడు. అయితే ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తైంది.కాగా  ఇందులో స్టార్ హీరోయిన్ సమంత నటిస్తోంది. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది.అయితే  అదే సమయంలో సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి.ఇక  దీంతో చిత్ర యూనిట్ వీలైనంత త్వరగా చిత్రీకరణను పూర్తి చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

అయితే 'ఖుషి' మూవీకి సంబంధించిన బ్యాలెన్స్ షూట్‌లో పాల్గొనేందుకు సమంత డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతోందట. ఇక దీనికి కారణం ఆమె నటించిన 'యశోద' మూవీనే అని తెలుస్తోంది.అయితే  తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా నవంబర్ 11న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఇక దీంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆమె భాగం కాబోతుంది. అయితే దీంతో 'ఖుషి' మూవీకి డేట్స్ ఇవ్వలేకపోయినట్లు తెలిసింది. ఇక దీంతో సమంత వల్ల విజయ్ దేవరకొండ కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు ఫిలిం నగర్ టాక్. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను నవంబర్ 15వ తేదీ నుంచి మొదలు పెట్టబోతున్నట్లు కూడా తాజాగా తెలిసింది.ఇకపోతే ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ స్టోరీతో రాబోతున్న 'ఖుషి' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: