బాలకృష్ణ మరో సినిమా కూడా ఒకే చేశాడా?

P.Nishanth Kumar
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న వీర సింహా రెడ్డి సినిమా సంక్రాంతికి విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు అనిల్ రావిపూడి సినిమా పైనే ఉంది.గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహా రెడ్డి మాస్ మసాలా సినిమాగా ప్రేక్షకుల ముందుకు సంక్రాంతి కానుకగా రాబోతుంది. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి సినిమాను బాలకృష్ణ ఏ విధంగా చేస్తాడో, అది ఏ జోనర్ లో రూపొందుతుందో అన్న ఆసక్తి అందరిలో ఏర్పడుతుంది.

యాక్షన్ ఎంట్టైన్మెంట్ సినిమాలు చేయడం లో అనిల్ రావిపూడి స్టైల్ ఎంతో బాగుంటుంది. అలాంటి దర్శకుడు తో సినిమా చేయాలని చాలామంది హీరోలు భావిస్తూ ఉంటారు. ఆ విధంగా బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ కి తగ్గ కథను రూపొందించి ఆయనకు వినిపించగా మొదటి సిట్టింగ్ లోనే దాన్ని ఓకే చేశాడు నందమూరి బాలకృష్ణ. అక్టోబర్లో ఈ సినిమాను మొదలు పెట్టాలని ముందుగా భావించారు కానీ వీర సింహా రెడ్డి సినిమా ఆలస్యం కావడంతో ఈ చిత్రం యొక్క చిత్రీకరణ మొదలు కావడానికి మరి కొంత సమయం పడుతుంది.

సంక్రాంతి తర్వాతనే ఈ సినిమాను మొదలుపెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాడట బాలకృష్ణ ఈ నేపథ్యంలో ఆ సినిమా తర్వాత కూడా మరొక సినిమాను ఒప్పుకునే విధంగా నందమూరి బాలకృష్ణ ముందడుగులు వేస్తున్నాడట. ఆ రెండు సినిమాలను ఒకేసారి చేయాలని ఆయన భావిస్తున్నాడట. ఇప్పటికే వెంకీ కుడుముల చెప్పిన కథకు ఇంప్రెస్ అయినా బాలకృష్ణ ఆ సినిమాను కూడా అనిల్ రావిపూడి తో కలిసి చేసే విధంగా రంగం సిద్ధం చేస్తున్నాడట. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు బయటకు వెల్లడి కానున్నాయి. అఖండ విజయం తర్వాత సరికొత్త జోష్ లో కనిపిస్తున్న నందమూరి బాలకృష్ణ ఎలక్షన్లకు ముందుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న ఈ ఇద్దరు ఇప్పుడు మరొక సినిమా చేయబోతూ ఉండడం విశేశం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: