బోయపాటి సినీమాలో ఊర్వశి రౌటేలా మెరవనుందా మరీ..!!

murali krishna
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న రామ్‌-బోయపాటి శ్రీను   సినిమా యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌ కంటెంట్‌తో క్లాస్‌, మాస్‌ ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యేలా ఈ సినిమా ఉండబోతుందని  బయట టాక్‌.
పెళ్లిసందD ఫేం శ్రీలీల ఈ చిత్రంలో రామ్‌తో రొమాన్స్ చేయబోతుంది అంటా మరీ.
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని  స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను  తో సినిమా చేస్తున్నాడని మనకు తెలిసిందే. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌ కంటెంట్‌తో క్లాస్‌, మాస్‌ ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యేలా ఈ సినిమా ఉండబోతుందని టాక్‌.
పెళ్లిసందD ఫేం శ్రీలీల ఈ చిత్రంలో రామ్‌తో రొమాన్స్ చేయబోతుంది. కాగా ఈ మూవీలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా ఐటెం సాంగ్‌ చేయనుందంటూ ఇప్పటికే సోషల్‌ మీడియాతోపాటు ఫిలింనగర్‌ సర్కిల్‌లో గాటుఅయిన వార్తలు  బాగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాజాగా ఈ న్యూస్‌పై ఊర్వశి స్వయంగా ఓ ఫొటోతో క్లారిటీ ఇచ్చేసింది. రామ్‌తో కలిసి దిగిన ఫొటోను ట్విటర్ ద్వారా షేర్ చేసి కన్ఫర్మ్ చేసినది
ఈ ట్వీట్‌తో ఐటెంసాంగ్‌ చేస్తున్నట్టు కన్ఫామ్‌ చేసింది. రామ్‌, ఊర్వశి రౌటేలా ఫొటో ఇపుడు నెట్టింట్లో బాగా ట్రెండింగ్‌ అవుతోంది. పవన్‌ కుమార్‌ సమర్ఫణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా టైటిల్‌ ఫిక్స్‌ కానీ ఈ చిత్రం 2023 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
రామ్‌ ఈ ఏడాది లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్‌ సినిమా చేశాడు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో సినీ జనాలను ఆకట్టుకోలేకపోయింది అని చెప్పొచ్చు. ఇస్మార్ట్‌ శంకర్‌ తర్వాత మళ్లీ ఆ రేంజ్‌ హిట్టు కోసం ఎదురుచూస్తున్న రామ్‌ ..బోయపాటి సినిమాతో ట్రాక్‌పైకి రావాలని అభిమానులు చూస్తున్నారు మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: