భర్తను వదిలేసి తిరుగుతున్నా స్టార్ యాంకర్..!!

murali krishna
యాంకర్ అనసూయ అంటే తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఈమె కేవలం యాంకర్ గానే కాకుండా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది.నిన్న మొన్నటి వరకు బుల్లితెరపై యాంకర్ గా వుంటూనే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తూ దూసుకుపోతుంది. అంతేకాదు పుష్ప సినిమాలో విలన్ గా కూడా చేసి అందర్నీ ఆకట్టుకుంది. ఇక వెండితెరపై ఈమెకు ఛాన్సులు ఎక్కువగా రావడంతో బుల్లితెర మీద చేసే జబర్దస్త్ షో కు కూడా గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం చేతినిండా ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇక ఈమె నటించే సినిమాల్లో ప్రాధాన్యమున్న పాత్రలను ఎంపిక చేసుకొని తనలో ఉన్న నటనని బయట పెట్టి అందరిని ఆకర్షిస్తోంది.
ఇక ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు టైం దొరికినప్పుడల్లా టూర్లు,వెకేషన్ లు తిరుగుతూ చాలా ఎంజాయ్ చేస్తుంది.ఈ విషయం పక్కనపెడితే అనసూయ గత కొన్ని రోజులుగా అమెరికాలో విహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. అమెరికాలో జరిగిన తానా వేడుకల కోసం అనసూయ అమెరికా వెళ్లినట్టు చెప్పింది. అనసూయ అక్కడ తెలుగు వాళ్ళతో కలిసి తానా వేడుకల్లో పాల్గొంది.ఆ తర్వాత అనసూయ టెక్సాస్ కి చేరుకుంది. ఇక టెక్సాస్ వీధుల్లో షాపింగ్ చేస్తూ అక్కడ ఉండే నేచర్ ని ఆస్వాదిస్తూ అలాగే దానికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తోంది. అంతేకాదు పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తూ యువతను మరింత ఆకర్షిస్తోంది. ఈ విషయం పక్కన పెడితే తాజాగా అనసూయ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఓ వ్యక్తి తో దిగిన ఫోటోను షేర్ చేసింది.
ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియా మొత్తం వైరల్ గా మారింది. ఎందుకంటే ఆ ఫోటోలో ఆమె పక్కన నిలుచున్న వ్యక్తి ఎవరా అని ఆ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టారు. ఆ వ్యక్తి పేరు ఉజ్వల్ కస్టాల. అమెరికాలో అనసూయ ఉజ్వల్ ని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తన ఇన్స్టాగ్రామ్ లో ఆ పోస్ట్ పెట్టింది. ఇక అతనితో షేర్ చేసిన ఫోటో చూస్తుంటే అనసూయ అతనికి చాలా క్లోజ్ అని తెలుస్తోంది. దీంతో ఉజ్వల్ ఎవరా అని ఆరా తీయడం మొదలు పెట్టారు. అయితే అతని ప్రొఫైల్ ప్రైవేట్ గా ఉండడంతో లాక్ అయ్యింది. కానీ కొన్ని విషయాలు మాత్రం అతని గురించి బయట పడ్డాయి. ఉజ్వల్ అడివి శేష్ డైరెక్షన్లో వచ్చిన కిస్ సినిమాలో నటించాడు. అయితే ఉజ్వల్ నటుడు కావడంతో అనసూయకు ఫ్రెండ్ కావచ్చని దాంతో వారి మధ్య ఉన్న స్నేహం వల్లే అనసూయ అతనికి బర్త్ డే విషెస్ చెప్పింది కావచ్చని చాలామంది నెటిజన్స్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: