రామ్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తున్న ఊర్వశి...!!

murali krishna
మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న రామ్‌-బోయపాటి శ్రీను (Boyapati Sreenu) సినిమా యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌ కంటెంట్‌తో క్లాస్‌, మాస్‌ ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా ఈ సినిమా ఉండబోతుందని టాక్‌ వినిపిస్తుంది.
పెళ్లిసందD ఫేం శ్రీలీల ఈ చిత్రంలో రామ్‌తో రొమాన్స్ చేయబోతుందట.
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Sreenu)తో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌ కంటెంట్‌తో క్లాస్‌, మాస్‌ ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా ఈ సినిమా ఉండబోతుందని టాక్‌ నడుస్తుంది..
పెళ్లిసందD ఫేం శ్రీలీల ఈ చిత్రంలో రామ్‌తో రొమాన్స్ చేయబోతుందట. కాగా ఈ మూవీలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా ఐటెం సాంగ్‌ చేయనుందంటూ ఇప్పటికే సోషల్‌ మీడియాతోపాటు ఫిలింనగర్‌ సర్కిల్‌లో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాజాగా ఈ న్యూస్‌పై ఊర్వశి స్వయంగా ఓ ఫొటోతో క్లారిటీ ఇచ్చేసింది. రామ్‌తో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది.
ఈ పోస్ట్ తో ఐటెంసాంగ్‌ చేస్తున్నట్టు కన్ఫామ్‌ చేసింది. రామ్‌, ఊర్వశి రౌటేలా ఫొటో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్‌ అవుతోంది. పవన్‌ కుమార్‌ సమర్ఫణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా టైటిల్‌ ఫిక్స్‌ కానీ ఈ చిత్రం 2023 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుందట..
రామ్‌ ఈ ఏడాది లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్‌ సినిమా చేశాడు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలై న ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయి లో సినీ జనాలను ఆకట్టుకోలేకపోయింది. ఇస్మార్ట్‌ శంకర్‌ తర్వాత మళ్లీ ఆ రేంజ్‌ హిట్టు కోసం ఎదురుచూస్తున్న రామ్‌ ..బోయపాటి సినిమా తో ట్రాక్‌పైకి రావాలని చూస్తున్నాడట..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: