యూట్యూబ్ వంటకాలు చేస్తాను అంటున్న కార్తికేయ...!!

murali krishna
ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి హీరో గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న వారిలో హీరో కార్తికేయ గుమ్మకొండ కూడా ఒకరు.
కార్తికేయ నటించిన మొదటి సినిమా డిజాస్టర్ గా నిలిచినప్పటికీ ఆర్ఎక్స్ 100 సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ గా మారిపోయాడు కార్తికేయ. ఆర్ఎక్స్ 100 సినిమాతో భారీ పాపులారిటీని సంపాదించుకున్నాడట కార్తికేయ. కథ కార్తికేయ సినిమా విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే.
అయితే కార్తికేయ హీరోగా నటిస్తూనే మరోవైపు విలన్ పాత్రలకు కూడా సై అంటున్నాడు. ఇప్పటికే నాని నటించిన గ్యాంగ్ లీడర్, వలిమై లాంటి సినిమాల లో ప్రతి నాయకుడి గా నటించి మెప్పిం చిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా కార్తికేయ ఒక రెస్టారెంట్ ను ప్రారంభించాడు. గిస్మట్ అరబిక్ రెస్టారెంట్ ను కార్తికేయ ప్రారంభించారటా.. ఈ నేపథ్యంలో నే హోటల్లో ఫోటోల కు ఫోజులు ఇవ్వడంతో పాటు రెస్టారెంట్ లోని వివిధ రకాల పదార్థాలను కూడా రుచి చూశాడు.
అంతే కాకుండా యూట్యూబ్లో అనేక వంట లు తన వైఫ్ తో కలిసి చూసి ప్రిపేర్ చేస్తా ను అని తెలిపాడు కార్తికేయ. నాన్ వెజ్ అంటే చాలా ఇష్టమని డైట్ కోసం ప్రతి రోజు చికెన్ తినడం తో బోర్ కొడితే మటన్ తింటూ ఉంటాను. నేను నా భార్య యూట్యూబ్ చూసి అప్పుడప్పుడు అనేక వంటకాలను కూడా ట్రై చేస్తూ ఉంటాం అని చెప్పుకొచ్చాడు కార్తికేయ. ఇక పోతే కార్తికేయ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కార్తికేయ బెదురులంక 2012 సినిమా లో నటిస్తున్నాడ టా.. అలాగే యు వి క్రియేషన్స్ లో కూడా ఒక సినిమాను పూర్తి చేశా ను అని తెలిపారట కార్తికేయ

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: