ఆ ఒక్క సినిమాతో నటుడు వేణు జీవితం మారింది అంటా..!!

murali krishna
కొంత మంది హీరో అవకాశం కోసం ప్రయత్నిస్తే కొంత మంది నటుడు అవ్వాలని ప్రయత్నిస్తుంటారు మరి. దర్శకుడు అవ్వాలని, సంగీత దర్శకుడు అవ్వాలని ఎవరి ప్రయత్నాల్లో వారు ముందుకెళ్తూ ఉంటారు అని చెప్పొచ్చు. ఈ అవకాశాల వేటలో సక్సెస్ అయ్యేది 10% మాత్రమే. 90 శాతం మంది నిరాశ తో వెను తిరిగే వారే ఉంటారు కథ. అప్పటికే ఏడెనిమిది ఏళ్లుగా సినిమా హీరో అవ్వాలని పరితపిస్తున్నాడు తొట్టెంపూడి వేణు. ఎలా గోలా భారతీ రాజా వంటి దిగ్గజ దర్శకుడు దగ్గర ఒక అవకాశం సంపాదించుకున్నాడు ఆ రోజుల్లో. కొత్తవారితో ఒక సినిమా ప్రకటించాడు. అందులో నటించే ముగ్గురు హీరోల్లో వేణు సైతం ఒక హీరోగా ఎంపిక అయ్యాడు. షూటింగ్ కూడా మొదలైంది.
కానీ ఉన్నపలంగా ఓ రోజు షూటింగ్ ఆగిపోయింది అనే విషయం తెలిసి వేణు ఎంతో నిరాశకు గురయ్యాడు అంటా మరీ, దర్శకుడు అయిన భారతి రాజకి ఆ సినిమా నిర్మాతకి మధ్య ఆ చిన్న గొడవ జరగడంతో ఆ సినిమా ఆగిపోయింది. భారతీరాజా దర్శకత్వంలో వేణు గనక ఇండస్ట్రీకి పరిచయమై ఉంటే ఈ రోజు వేణు పరిస్థితి వేరేలా ఉండేది, ఇక సినిమా షూటింగ్ ఆగిపోయింది అని తెలియగానే ఓ రోజు కాఫీ షాప్ లో ఎంతో బాధతో కూర్చుని ఉన్నాడు. అదే సమయంలో అక్కడికి అతని ప్రాణ స్నేహితులైన శ్యాం ప్రసాద్ వచ్చాడు. చూడగానే శ్యాంప్రసాద్ కి విషయం అర్థమైంది. సినిమా అనివార్య కారణాలతో ఆగిపోయింది అన్న విషయం స్నేహితుడితో చెప్పి ఎంతో బాధపడ్డాడు నటుడు వేణు. ఇన్నేళ్ల సినిమా ప్రయత్నాలలో ఇంత బాధగా వేణుని ఎన్నడూ అలా చూడలేదు.
వాస్తవానికి వేణు లో ప్రేమకథా చిత్రాలు మాత్రమే కాదు ఎంతో హాస్యం కూడా ఉండేది అని చెప్పొచ్చు.దాంతో శ్యాం ప్రసాద్ రెడ్డికి ఒక చురుకైన ఆలోచన వచ్చింది. తానే వేణుని హీరోగా పెట్టి ఎందుకు సినిమా చేయకూడదు అని ఆలోచించాడు. అనుకున్నది అనుకున్నట్టుగానే ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ పతాకం అనే బ్యానర్ ని స్థాపించాడు. ఇక స్వయంవరం అనే సినిమాకి నాంది పడింది. ఈ సినిమాలో వేణు హీరోగా నటిస్తే లయ హీరోయిన్ గా నటించగా ఈ సినిమా ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో మనందరికీ బాగా తెలిసినా విషయమే, ఈ సినిమా తర్వాత చిరునవ్వుతో సినిమా కూడా వేణుకి మంచి విజయాన్ని అందించింది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు వేణు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు మరీ. ఇక జగపతిబాబు, అర్జున్, వేణు కలిసి చేసిన సినిమా హనుమాన్ జంక్షన్. జగపతిబాబు, అర్జున్ కాంబినేషన్ సీన్స్ అన్నీ కూడా ఎంతో ఆక్షన్ ఓరియంటెడ్ గా ఉంటే ఇక ఆ తర్వాత వచ్చిన పెళ్ళాం ఊరెళితే ,పెళ్ళాంతో పనేంటి వంటి సినిమాల్లో ఆయన పూర్తిస్థాయి కమెడియన్ కం హీరో రోల్ పోషించాడు అని చెప్పొచ్చు. కళ్యాణ రాముడు, సదా మీ సేవలో, చెప్పవే చిరుగాలి, ఖుషి ఖుషి గా వంటి సినిమాల్లో ఆసాంతం నవ్వులు వర్షం పోయించాడు నటుడు వేణు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: