మసక బారుతున్న బాలీవుడ్ దీపం...!!

murali krishna
మా ములుగా దీపావళి పండగంటే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో సందడి ఉంటుంది. కనీసం నాలుగైదు రోజుల పాటు థియేటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్లతో కళకళలాడతాయి.ఇది ప్రతి సంవత్సరం జరిగేదే. కానీ ఇప్పుడు మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. పెద్ద హీరోలకే కనీస ఓపెనింగ్స్ దక్కడం లేదు. అక్షయ్ కుమార్ రామ్ సేతుకి ఎంత పబ్లిసిటీ చేసినా జనం హాలుకు వచ్చేందుకు సుముఖత చూపించలేదు. అజయ్ దేవగన్ సిద్దార్థ్ మల్హోత్రా కాంబినేషన్ లో రూపొందిన థాంక్ గాడ్ సైతం పబ్లిక్ ని ఇంటి నుంచి తీసుకురావడంలో ఫెయిలయ్యింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఎక్కడా కనీసం ఇరవై శాతం ఆక్యుపెన్సీ లేకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.
మరోవైపు వీటికి రివ్యూలు, పబ్లిక్ టాక్ ఏమంత సానుకూలంగా లేవు. రామ్ సేతుని క్రిటిక్స్ గట్టిగానే నిలదీశారు. కంటెంట్ బాగున్నా ప్రెజెంటేషన్ వీక్ గా ఉండటంతో అక్షయ్ కుమార్ కు మరో డిజాస్టర్ ఖాయమని తేలిపోయింది. మరోవైపు థాంక్ గాడ్ పర్లేదనిపిస్తున్నా ఇది కూడా బిగ్ స్క్రీన్ డిమాండ్ చేసే బొమ్మ కాదని సోషల్ మీడియా ట్రెండ్స్ ని గమనిస్తే అర్థమవుతోంది. దశాబ్దాల తరబడి ఇండస్ట్రీని ఏలుతున్న అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి హీరోలకు ఇలాంటి సిచువేషన్ రావడం ట్రాజెడీ. ఈ మధ్యే వచ్చిన అమితాబ్ బచ్చన్ గుడ్ బై కూడా ఇదే సీన్ రిపీట్ చేసింది. పుష్ప ఫేమ్ రష్మిక మందన్న హిందీ డెబ్యూని కనీస స్థాయిలో పట్టించుకున్న పాపాన పోలేదు.అసలు ఏ అంచనాలు లేకుండా వచ్చిన డబ్బింగ్ మూవీస్ కాంతార, కార్తికేయ 2, ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2లే నార్త్ లో హయ్యెస్ట్ గ్రాసర్స్ నిలచాయంటేనే అక్కడి నిర్మాతల మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎంతో గొప్పగా చెప్పుకున్న ది కాశ్మీర్ ఫైల్స్, గంగూ బాయ్ కటియావాడి, భూల్ భులయ్యా 2, బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ వగైరాలు నాలుగు వందల కోట్లను టచ్ చేయలేక మూడు లోపలే సర్దుకోవాల్సి వచ్చింది. గ్రాండియర్ల తీసే విషయంలో పోటీ పడుతున్నప్పటికీ క్వాలిటీ కంటెంట్ ఇచ్చే విషయంలో మాత్రం బాలీవుడ్ జనాలు దక్షిణాది మేకర్స్ కన్నా బాగా వెనుక బడ్డారు. ఈ స్తబ్దత పోవాలంటే షారుఖ్ ఖాన్ పఠానో లేదా సల్మాన్ ఖాన్ టైగర్ 3నో అద్భుతాలు చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: