జపాన్ లో తన బిగ్గెస్ట్ ఫ్యాన్ ను కలిసిన రామ్ చరణ్...!!

murali krishna
జపాన్ లో మన దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ కు అశేష అభిమానులున్నారు. రజినీ నటించిన 'నరసింహా' నుంచి చంద్రముఖి వరకూ సినిమాలన్నీ అక్కడ బాగా ఆడుతున్నాయట..
రజినీకాంత్ తర్వాత ఆ స్థాయి అభిమానులు మన రాంచరణ్ కు ఉన్నారని తెలుస్తోంది. జపాన్ లో రాంచరణ్ కు డైహార్ట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారన్న విషయం తాజాగా బయటపడింది. 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ తర్వాత రాంచరణ్ సినిమాలను అమితంగా ఇష్టపడే అభిమానులు కూడా ఆ దేశంలో ఉన్నారని తెలిసింది.
తాజాగా 'మగధీర ' సినిమా నుంచే తనను అభిమానిస్తున్న ఒక వృద్ధురాలిని రాంచరణ్ కలుసుకున్నారు. 'మగధీర' రోజుల నుంచి తను రాంచరణ్ ను ఫాలో అవుతోందని.. రాంచరణ్ పై గీసిన స్కెచ్చులు, ఫొటోలు, చిత్ర విశేషాలపై ఆమె తయారు చేసిన బుక్ ను రాంచరణ్ కు చూపించిందట.. ఆమె అభిమానాన్ని చూసి రాంచరణ్ ఫిదా అయిపోయారు. రాంచరణ్ అంటే తనకు ఎంతో ఇష్టం అన్న ఆ బామ్మను హత్తుకొని ఆమె అభిమానికి రాంచరణ్ కృతజ్ఞతలు తెలిపారు. రాంచరణ్ స్కెచ్ తో కూడిన టీషర్ట్ ను కూడా ఆమె ధరించి తన అభిమానాన్ని అయితే చాటుకుంది.
రాంచరణ్ ను నిజంగా 'ఒక గ్లోబల్ సూపర్ స్టార్'గా ఆ బామ్మ అభివర్ణించింది. మగధీరలో రామ్‌చరణ్ అద్భుతంగా నటించాడని.. ఆయన అద్భుతమైన నటన.. ఆ చారిత్రాత్మక అవతార్‌లో లీనమైపోయాడని ఆమె కొనియాడింది. రాంచరణ్ నటించిన సినిమాల్లో తనకు మగధీర బాగా నచ్చిన సినిమా అని ఆమె పేర్కొందట..
ఇక రాంచరణ్ కు అక్కడి జనాలు నీరాజనాలు పలుకుతున్నారు. గ్లోబల్ స్టార్ అంటూ రాంచరణ్ ఫొటోలను జపాన్ అభిమానులు కామెంట్స్ చేస్తూ కొనియాడుతున్నారు. రజినీకాంత్ తర్వాత జపనీస్ ప్రేక్షకులలో అన్ని వయసుల వారి నుండి ఏకపక్షంగా ఇంతటి అభిమానాన్ని సంపాదించుకున్న ఏకైక హీరో మన రాంచరణ్ అని చెప్పకతప్పదు. ఇంతటి అభిమానం సంపాదించుకున్న రాంచరణ్ ప్రస్తుతం ఆ దేశ పర్యటనలో వారిని కలుస్తూ సంతోషాన్ని పంచుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: