నాని "దసరా" మూవీలో స్పెషల్ సాంగ్ చేయనున్న ఆ టాలీవుడ్ స్టార్ హీరోయిన్..?

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా అనే మూ వీలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో నేను లోకల్ మూవీ తెరకెక్కింది. నేను లోకల్ మూవీ లో వీరిద్దరి జంటకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.  నేను లోకల్ మూవీ మంచి విజయం సాధించింది. నాని , కీర్తి సురేష్ కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా.  దసరా మూవీ కి శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తూ ఉండగా , ఈ మూవీ లో పూర్ణ ప్రతినాయక పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతుంది.  ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇప్పటికే దసరా మూవీ నుండి కొన్ని ప్రచార చిత్రాలను మూవీ యూనిట్ విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.  

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... దసరా మూవీ లో ఒక అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉండబోతున్నట్లు ,  ఆ ఐటమ్ సాంగ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే మిల్కీ బ్యూటీ తమన్నా ఎన్నో మూవీ లలో ఐటమ్ సాంగ్ లలో నటించి తన అంద చందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టి పడేసింది. మరోసారి దసరా మూవీ లో తమన్నా ఐటెం సాంగ్ లో నటించబోతున్నట్లు ఒక వార్త అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మిల్కీ బ్యూటీ తమన్న మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ లో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: