ఈ వారం బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

Satvika
ఈ ఆదివారం బిగ్ బాస్ దివాలి సెలెబ్రెషన్స్ తో రచ్చ రచ్చ చేశారు.అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయినా సంగతి తెలిసిందే.శ్రీసత్య బాగా ఎమోషనల్ అయింది. ఇక సోమవారం నాడు నామినేషన్స్ జరిగాయి. ఈ సారి గత వారాల కంటే తక్కువ గొడవలే జరిగాయి. నామినేషన్స్ కి ముందు ఇంటి సభ్యులు కొంతమంది మాట్లాడటం చూపించారు. శ్రీసత్య తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి శ్రీహన్ కి చెప్తూ బాధపడింది.

ఆ తర్వాత నామినేషన్స్ ని మొదలుపెట్టారు. ఒక్కో కంటెస్టెంట్ నామినేట్ చేసే వాళ్ళ ఇద్దరి ఫోటోలని మంటల్లో వేయాలన్నారు బిగ్‌బాస్‌. శ్రీసత్య.. సూర్య, మెరీనాని నామినేట్ చేసింది. ఆదిరెడ్డి.. ఇనయ, మెరీనాలని నామినేట్ చేసాడు. ఆదిరెడ్డి ఇనయాని ఇష్టమొచ్చినట్టు మాట్లాడినా ఇనయా నవ్వుతు ఓకే చెప్పడంతో ఆశ్చర్యపోయాడు. గీతూ.. ఇనయ, మెరీనాలని నామినేట్ చేసింది. గీతూ మెరీనాని నువ్వు అసలు హౌజ్ లో పనికిరావు అంటూ అనేసింది. బాలాదిత్య.. శ్రీసత్య, గీతూలని నామినేట్ చేశాడు. కీర్తి.. రేవంత్‌, శ్రీసత్యలని నామినేట్ చేసింది. దీంతో రేవంత్ కి, కీర్తికి గొడవ జరిగింది. సూర్య.. ఇనయ, శ్రీసత్యని నామినేట్ చేశాడు. సూర్య ఇనయాని నామినేట్ చేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. రోహిత్‌.. గీతూ, శ్రీసత్యలని నామినేట్ చేశాడు..

ఇకపోతే ఇనయ.. శ్రీహాన్‌, సూర్యలని నామినేట్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇనయా మాట్లాడుతూ సూర్యతో నీకు, నాకు మధ్య ఏదో ఉందని అంతా అనుకుంటున్నారు. నాగ్ సర్ నాకు అన్ని సార్లు చెప్పిన తర్వాత కూడా నీతో క్లోజ్ గా ఉండటం కరెక్ట్ కాదు. మనది జస్ట్ స్నేహం మాత్రమే అంది. సూర్య అంతేనా అనడంతో అవును అని చెప్పింది. ఇక శ్రీహాన్ ని నామినేట్ చేస్తూ అందరూ మన గురించే మాట్లాడుకుంటున్నారు. అది నాకు నచ్చట్లేదు. నువ్వు జస్ట్ హౌజ్ మెట్ మాత్రమే అని చెప్పింది. ఇప్పటి నుంచి గేమ్ మీద ఫోకస్ పెట్టాలని సూచించింది..ఫైమా.. శ్రీసత్య, మెరీనాలని నామినేట్ చేసింది. రాజ్‌.. ఇనయ, రేవంత్‌లని నామినేట్ చేశాడు. మెరీనా.. ఫైమా, రాజ్‌ లని నామినేట్ చేసింది. రేవంత్‌ కీర్తి నామినేట్ చేసి గొడవపడటంతో కీర్తిని నామినేట్ చేశాడు. అలాగే గీతూని నామినేట్ చేయడంతో గీతూకి, రేవంత్ కి మధ్య గొడవ అయింది...ఎక్కువ మంది మెరినాను నామినేట్ చేశారు..అంతేకాదు ఆమె హౌస్ లో గేమ్ ను బాగా ఆడటం లేదు..మొత్తానికి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది మెరీనా అని తెలుస్తుంది..మరి ఏం జరుగుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: