ఆసుపత్రిలో చేరిన వర్ష..ఏమైందంటే?

Satvika
జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..కామెడీ షో ద్వారా తను ఎంతో పాపులారిటీని దక్కించుకుంది. మొదట్లో ఇండస్ట్రీకి వచ్చాక సీరియస్ లో చిన్న చిన్న క్యారెక్టర్ చేస్తూ వచ్చింది.అప్పటి లో అంత క్రేజ్ లేదు..కానీ ఇప్పుడు మాత్రం మంచి ఫామ్ లో ఉందని తెలుస్తుంది.జబర్దస్త్ లోకి వచ్చాకే ఆమెకు ఇంత క్రేజ్ వచ్చింది. జబర్దస్త్ స్టేజ్ మీద అలా బ్లూ చీరలో కనిపించిన వర్ష అప్పటినుంచి ట్రెండ్ అవుతూనే వచ్చింది. వర్ష అందానికి అందరూ ఫిదా అయ్యారు. ఇక ఆమెకున్న వెరైటీ గొంతు వలన ఆమెపై ఎన్ని సెటైర్లు వేసిన లేడీ గెటప్ అంటూ అందరూ కౌంటర్లు వేసిన కూడా జనాలు మాత్రం ఆమెను ఇష్టపడుతూనే ఉంటారు.


వర్ష మాన్యువల్ ట్రాక్ ఎప్పుడైతే స్టేజ్ పై వర్క్ అవుట్ అయిందో అప్పటినుంచి ఈ ఇద్దరు బుల్లితెరపై క్రేజీ జంటగా పేరు తెచ్చుకున్నారు. సుధీర్ రష్మీ రేంజ్ లో కాకపోయినా వర్ష ఇమాన్యుయెల్ జంటకు కూడా బాగానే క్రేజ్ ఉంది. ఇద్దరు కలిసి ఎన్నో ఈవెంట్లు పండుగ షోలు చేశారు. ఇద్దరి మీద ఈవెంట్లు కూడా తయారు చేసే రేంజ్ కి వెళ్లారు. కానీ జబర్దస్త్ లో వీరిద్దరి ఓవరాక్షన్ హద్దులు దాటడంతో జనాలు అంతగా మెచ్చుకోవడం లేదు. మధ్యలో కాస్త తగ్గించినట్టు అనిపించినా మళ్ళీ మొదలుపెట్టేశారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఇద్దరు చేసే హడావిడి మామూలుగా ఉండదు.

ఇక సోషల్ మీడియాలో అయితే ఆమె పెట్టె పోస్టులు మాములుగా లేవని చెప్పాలి.నగ్న ఫోటోలు, అర్థనగ్న ఫోటోలను షేర్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. అయితే తాజాగా జబర్దస్త్ వర్ష కు ఆరోగ్యం బాగాలేదని తెలుస్తుంది. ఆదివారం నాడు ఆరోగ్యం బాగా లేకపోవడం వలన చికెన్ కూడా తినలేక పోయిందట. టాబ్లెట్లు వేసుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు వర్షం హాస్పటల్ బెడ్ మీద కనిపించింది. ఇందులో ఆమె చేతికి సెలైన్ ఉంది. పైగా ఇంకా ఏదో టెస్టులు కూడా చేస్తున్నట్లు కనిపిస్తుంది. మరి ఆమెకు మామూలు ఫీవర్ వచ్చిందా లేదా ఇంకేమైనా సీరియస్ అయ్యిందా అన్నది తెలియాల్సి ఉన్నది.. మరి ఆమె దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి వుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: