మహేష్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంజుల...!!

murali krishna
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రేమ గురించి ఆయన సోదరి మంజుల పలు ఆసక్తికర విషయాలు బయట పెట్టారు. మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణకు ఐదుగురు సంతానం కాగా వారిలో రమేష్ బాబు పెద్దవారట..
ఆ తర్వాత మంజుల, పద్మావతి, ప్రియదర్శిని అనే ముగ్గురు ఆడ సంతానం ఉన్నారు. తర్వాత మహేష్ బాబు కూడా జన్మించారు. వీరిలో రమేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి తర్వాత అది కలిసి రాక పోవడంతో నిర్మాతగా పలు సినిమాలు చేస్తూ వచ్చారుట.
ఇటీవలే రమేష్ బాబు కాలం చేశారు. అలాగే మంజుల పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండగా ప్రియదర్శిని హీరో సుధీర్ బాబుని వివాహం చేసుకున్నారు. పద్మావతి గల్లా జయదేవ్ ని వివాహం చేసుకోగా వారి కుమారుడు గల్లా అశోక్ ఇటీవల హీరో అనే సినిమాతో హీరోగా లంచ్ అయ్యారు. అసలు విషయం ఏమిటంటే తాజాగా మంజుల మంచు లక్ష్మితో కలిసి ఒక వీడియో చాట్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా మహేష్ బాబు గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పమని మంచు లక్ష్మి కోరడంతో మహేష్ బాబు ప్రేమ గురించి మంజుల ఆసక్తికర విషయాన్ని బయట పెట్టిందట..
మహేష్ బాబు తాను ఎప్పుడూ మంచి మార్గంలో ఉండేలా గైడ్ చేస్తూ ఉంటాడని మంజుల అన్నారు. బేసిగ్గా తనకి కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువ అని ఏం చేయాలో ఎలా చేయాలో అని కన్ఫ్యూజ్ అవుతున్న సమయంలో మహేష్ తనను కరెక్ట్ గా ఏం చేయాలో అర్థం అయ్యేలా చెబుతాడని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాక తన తల్లి అప్పుడప్పుడు చెబుతూ ఉంటారని మహేష్ కి ప్రేమ లోపల ఉంటుంది దాన్ని బయటకు వ్యక్తం చేయడం ఇష్టం ఉండదని ఆమె అన్నారు.
అలాగే నా పుట్టినరోజు నాడు మహేష్ ఫోన్ చేసి ఏం చేస్తున్నావ్? ఈరోజు ప్లాన్స్ ఏంటి అని అడుగుతాడు కానీ హ్యాపీ బర్త్డే అని చెప్పడని తన ప్రేమ అంతా తన మనసులోనే దాచేసుకుంటాడని ఈ సందర్భంగా మంజుల చెప్పుకొచ్చారు. ఇక మంచు లక్ష్మి కూడా తన సోదరుల గురించి అలాగే తన తండ్రి గురించి పలు విషయాలు బయటపెట్టారట.. ఇక మహేష్ బాబు తండ్రి కృష్ణ గురించి మంజుల మాట్లాడుతూ ఆయన అద్భుతమైన వ్యక్తి అని ఆయన ప్రేమ అనిర్వచనీయమైనదని అసలు ఎలాంటి షరతులు లేకుండా ఆయన ప్రేమ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: