సీతారామం చిత్రనికి ఎన్ని కోట్లు లాభమో తెలుసా..?

Divya
హీరో దుల్కర్ సల్మాన్, మృణాల ఠాగూర్ కలిసిన చిత్రం సీతారామం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హనురాఘవపూడి ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఇందులో స్టార్ హీరోయిన్ రష్మిక కూడా నటించింది. అలాగే తరుణ్ భాస్కర్, సుమంత్ గౌతమ్ మీనన్, భూమిక తదితరులు కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమా ట్రైలర్ టీజర్ కు భారీగానే రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీన విడుదలై మొదటి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్ల విషయానికి వస్తే..
1). నైజాం-10.6 కోట్ల రూపాయలు.
2). సిడెడ్-1.98కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-3.60 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-2.3 కోట్ల రూపాయలు.
5). వెస్ట్-1.30 కోట్ల రూపాయలు.
6). గుంటూరు-1.70కోట్ల రూపాయలు
7). కృష్ణ-1.80 కోట్ల రూపాయలు.
8). నెల్లూరు- 92లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.23.39 కోట్ల రూపాయలు రాబట్టింది.
10). రెస్ట్ ఆఫ్ ఇండియా-2.92 కోట్ల రూపాయలు.
11). ఓవర్సీస్-7.30 కోట్ల రూపాయలు.
12). మిగిలిన వెర్షన్లు-8.28 కోట్ల రూపాయలు.
13). హిందీ వెర్షన్-4.30 కోట్ల రూపాయలు.
12). ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే రూ. 46.19  కోట్ల రూపాయలు రాబట్టింది.
సీతారామన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.16.5 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరగగా.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే కచ్చితంగా రూ.17 కోట్ల రూపాయలను రాబట్టాల్సి ఉంటుంది అయితే మొదటి వారమే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసినట్లుగా సమాచారం. ఇక ఈ చిత్రం ముగిసే సమయానికి రూ.46.19 కోట్ల రూపాయలను రాబట్టింది ఈ చిత్రం డబల్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో ఏకంగా బయ్యర్లకు దాదాపుగా రూ.29.19 కోట్ల రూపాయల లాభాన్ని అందించిందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంతో మృనాల్ ఠాగూర్, దుల్కర్ సల్మాన్ మరింత పాపులర్ అయ్యారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: