నటి పూర్ణ ఇచ్చిన ట్విస్ట్ మామూలుగా లేదుగా..!!

murali krishna
ఇది మామూలు ట్విస్ట్ కాదు. హీరోయిన్ పూర్ణకు రేపోమాపో పెళ్లి అని అందరూ అంటుకున్న తరుణంలో ఆల్రెడీ పెళ్ళైపోయిందని చెప్పి బిగ్ షాక్ ఇచ్చింది ఈ నటి
పూర్ణ లేటెస్ట్ స్టేట్మెంట్ అందరినీ తెగ ఆశ్చర్యంలో ముంచేసింది.
ఈ ఏడాది ప్రారంభంలో పూర్ణ తనకు కాబోయేవాడిని పరిచయం కూడా చేసింది. సోషల్ మీడియా వేదికగా అతనితో దిగిన ఫోటో షేర్ చేసింది మరీ, ఇక పూర్ణకు కాబోయే భర్త వివరాలు పరిశీలిస్తే అతడు దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త.పేరు షానిద్ అసిఫ్ అలీ. అనంతరం వీరిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. త్వరలో వివాహం అంటూ ఊహాగానాలు తెరపైకి  కుడా వచ్చాయి.
సడన్ గా బ్రేకప్ రూమర్స్ కూడా వినిపించాయి మరీ నిశ్చితార్థం జరిగి చాలా కాలం అవుతున్నా పెళ్లి వార్త రాకపోవడంతో పూర్ణ మనసు మార్చుకున్నారు. షానిద్ తో ఆమె విడిపోయారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ రూమర్స్ కి పూర్ణ చెక్ పెట్టారు. మరోసారి షానిద్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోనూ అమే షేర్ చేశారు. దాంతో క్లారిటీ వచ్చింది. అలాగే ఈ ఏడాది చివర్లో పూర్ణ వివాహం చేసుకునే సూచనలు కలవు అంటూ వాదన మొదలైంది.
అయితే పూర్ణ మాత్రం ఊహించని షాక్ ఇచ్చింది. ఆల్రెడీ నాకు పెళ్లి అయ్యిందని చెప్పి  పెద్దా బాంబు పేల్చింది. లేటెస్ట్ మీడియా ఇంటరాక్షన్ లో పూర్ణ ఈ ఆసక్తికర సంగతులు బయటపెట్టారు. మే 31న షానిద్ తో నాకు నిశితార్థం జరిగింది. ఆ నెక్స్ట్ మంత్ జూన్ 12న దుబాయ్ లో వివాహం కూడా జరిగింది అని,కొన్ని కారణాల వలన అత్యంత సన్నిహితులు మాత్రమే మా వివాహానికి హాజరయ్యారని పూర్ణ ఇలా వెల్లడించారు.
ఇక ఇండియాలో గల బంధువులు, సన్నిహితులు, స్నేహితుల కోసం కేరళలో త్వరలో రిసెప్షన్ నూ ఏర్పాటు చేయనున్నట్లు పూర్ణ చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లు పూర్ణకు నిశ్చితార్థం మాత్రమే జరిగిందని అందరూ అనుకుంటున్నారు. హఠాత్తుగా పెళ్లి కూడా పూర్తయిందంటూ పూర్ణ అనుకోని ట్విస్ట్ ఇచ్చారు. థ్రిల్లర్ మూవీకి మించిన ఈ ట్విస్ట్ కి జనాలు ఇంకా కోలుకోలేదు.
పెళ్లి చేసుకొని కూడా పూర్ణ సినిమాలు, టెలివిజన్ షోలు చేస్తున్నారని ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇటీవల పూర్ణ నటించిన తీస్ మార్ ఖాన్ విడుదలైంది. తెలుగు తమిళ భాషల్లో కలిపి అరడజను చిత్రాలు చేతిలో ఉన్నాయి.
ఇక పూర్ణ కెరీర్ పరిశీలిస్తే ఆమెకు మంచి ఆరంభం లభించింది అని చెప్పొచ్చు. పూర్ణ హీరోయిన్ గా నటించిన సీమటపాకాయ్, అవును లాంటి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి కానీ కొన్ని కారణాల వలన సినిమాలు వాడుకున్నాను, అది నా కెరీర్ కి మైనస్ అయ్యిందని పూర్ణ గతంలో వెల్లడించారు.
ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు మరి. హీరోయిన్ గా దాదాపు ఫేడ్ అవుటైన పూర్ణ క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు ఇప్పుడు. అఖండ, దృశ్యం 2 చిత్రాల్లో పూర్ణ ప్రాధాన్యం ఉన్న పాత్రలు దక్కించుకున్నారు. అలాగే టెలివిజన్ షోస్ లో తన మార్కు ఎంటర్టైన్మెంట్ తో అలరిస్తున్నారు నటి పూర్ణ గారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: