బిల్లా' స్పెషల్ షోస్ లో అపశృతి..థియేటర్ ని తగలబెట్టేసిన ప్రభాస్ ఫాన్స్....!

murali krishna
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా నేడు ప్రపంచవ్యాప్తంగా బిల్లా మూవీ స్పెషల్ షోస్ ని అభిమానులు ఏర్పాటు చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..దీపావళి కానుకగా కొత్త సినిమాలు విడుదల అవ్వడం తో బిల్లా సినిమాకి సాయంత్రం సమయం లో షోస్ దొరకలేదు..దానితో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉదయం 8 గంటలకు షోస్ ని ప్రదర్శించారు..ఈ షోస్ కి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.స్టార్ హీరోల కొత్త సినిమాలు కూడా ఉదయం 8 గంటల సమయంలో హౌస్ ఫుల్ లు పడని ఈ రోజుల్లో ఎప్పుడో 13 ఏళ్ళ క్రితం విడుదలైన బిల్లా సినిమాకి ఈ రేంజ్ హౌస్ ఫుల్ లు పడడం ప్రభాస్ క్రేజ్ కి నిదర్శనం అని చెప్పొచ్చు..ఇక వెస్ట్ గోదావరి జిల్లాలో ప్రభాస్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుంది అనే విషయం మన అందరికి తెలిసిందే..ఈరోజు బిల్లా సినిమాకి ఇక్కడ రికార్డు స్థాయి షోస్ ప్రదర్శితమయ్యాయి.
అయితే ప్రభాస్ అభిమానుల అత్యుత్సాహం వల్ల తాడేపల్లిగూడెం లో అపశృతి చోటు చేసుకుంది..తాడేపల్లి గూడెం లో లక్ష్మి నారాయణ కాంప్లెక్స్ లో నేడు బిల్లా సినిమాకి 8 గంటల ఆటని ప్రదర్శించారు..థియేటర్ వద్ద అభిమానులు సంబరాలతో హోరెత్తించారు..అయితే థియేటర్ లోపల అభిమానులు సంబరాలు చేసుకోవడంలో భాగంగా స్మోక్ పెట్టారు..దీనితో థియేటర్ లో చిన్న పాటి ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది..చాలా సీట్స్ కాలిపోయాయి కూడా..వెంటనే థియేటర్ సిబ్బంది అప్రమత్తం అయ్యి మంటలు ఆర్పివేయడం తో భారీ పెను ప్రమాదం నుండి తప్పించుకున్నారు అభిమానులు..అయితే వెంటనే ఆ షో ని రద్దు చేసి అభిమానులను వెనక్కి పంపేశారు థియేటర్ యాజమాన్యం.గతం లో జల్సా మరియు పోకిరి స్పెషల్ షోస్ లో కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి..చాలా చోట్ల థియేటర్స్ లో స్క్రీన్స్ చిరిగిపోవడం,సీట్స్ విరిగిపోవడం వంటివి జరిగాయి..స్పెషల్ షోస్ వేసినప్పుడల్లా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటుండడం తో భవిష్యత్తులో అసలు స్పెషల్ షోస్ వేసుకోవడానికి థియేటర్స్ యాజమాన్యాలు ముందుకు వస్తాయా అనేది ప్రస్నార్ధకంగా మారింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: